
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అయిన ‘ఘరానా మొగుడు’ సినిమాలో హీరోయిన్ రోజా మొదటగా ఎంపికయ్యారని మీకు తెలుసా? ఒక అద్భుతమైన పాట కారణంగా చిరంజీవి రోజాని తొలగించి వాణి విశ్వనాథ్‌ని ఎందుకు తీసుకున్నారు? ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.
Key Points
చిరంజీవి-రోజా కాంబోలో ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ మిస్ అయింది.
ఘరానా మొగుడు చిత్రంలో రోజా స్థానంలో వాణి విశ్వనాథ్ నటించాల్సి వచ్చింది.
'దిగు దిగు నాగ' సాంగ్తో వాణి విశ్వనాథ్ నటన చిరంజీవిని ఆకట్టుకుంది.
ఈ కారణంతోనే రోజాని తొలగించి ఘరానా మొగుడులోకి వాణి విశ్వనాథ్ వచ్చారు.
చిరంజీవి-రోజా కాంబో ఎందుకు మిస్సయ్యింది?
మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రోజా కాంబినేషన్ లో కొన్ని చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, రోజా లది సూపర్ హిట్ కాంబినేషన్ ఏమీ కాదు. వీరి కాంబోలో వచ్చింది బిగ్ బాస్ తీవ్రంగా నిరాశపరిచింది. ముగ్గురు మొనగాళ్లు, ముఠామేస్త్రి చిత్రాలు పర్వాలేదనిపించాయి. వీరిద్దరి కాంబోలో ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ మిస్ అయింది. అసలు ఈ చిత్రం ఏంటి ? ఎందుకు మిస్ అయింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఘరానా మొగుడు మూవీ 1992లో విడుదలై ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రంలో వాణి విశ్వనాథ్, నగ్మా హీరోయిన్లుగా నటించారు.
ఘరానా మొగుడులో రోజాకు బదులు వాణి ఎలా?
వాస్తవానికి వాణి విశ్వనాథ్ స్థానంలో ఈ మూవీలో రోజా నటించాల్సింది. రోజాని ఎంపిక చేశారట కూడా. కానీ ఘరానా మొగుడు మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి వాణి విశ్వనాథ్ నటించిన సర్పయాగం అనే చిత్రం విడుదలైంది. పరుచూరి గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో రాజా రవీంద్ర, వాణి విశ్వనాథ్ మధ్య దిగు దిగు నాగ అనే బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటుంది.
ఈ సాంగ్ లో వాణి విశ్వనాథ్ గ్లామర్ ఒలకబోస్తూ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులు మాత్రమే కాదు వాణి విశ్వనాథ్ పెర్ఫార్మెన్స్ కి చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. దీనితో రోజాని తొలగించి ఆమె స్థానంలో వాణి విశ్వనాథ్ ని ఘరానా మొగుడు చిత్రంలో తీసుకున్నారు. ఈ విషయాన్ని రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సర్పయాగంలో వాణి విశ్వనాథ్ తో నటించింది అతడే.
ఇండస్ట్రీ హిట్ వెనుక ఆసక్తికర కారణం
వాణి విశ్వనాథ్, చిరంజీవి మధ్య ఘరానా మొగుడు చిత్రంలో వచ్చే రైన్ సాంగ్ కిటుకులు తెలిసిన అనే పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో ది బెస్ట్ సాంగ్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ సాంగ్ లో వాణి విశ్వనాథ్ గ్లామర్, చిరంజీవి డ్యాన్స్.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటాయి. మొత్తంగా వాణి విశ్వనాథ్ సర్పయాగం మూవీలో ఒక్క సాంగ్ తో రోజా స్థానానికి ఎసరు పెట్టింది. ఆ విధంగా రోజా చిరంజీవితో ఇండస్ట్రీ హిట్ మూవీ మిస్ అయింది.
మొత్తంగా, ‘సర్పయాగం’ చిత్రంలోని ఒక పాటతో వాణి విశ్వనాథ్ ప్రతిభ చిరంజీవిని ఆకట్టుకుంది. దీనితో రోజాకు ఇండస్ట్రీ హిట్ అయిన ‘ఘరానా మొగుడు’ సినిమా మిస్సయ్యింది. ఇది సినిమా చరిత్రలో ఒక ఆసక్తికర సంఘటనగా నిలిచింది.


