|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చిరంజీవి కాళ్ళు పట్టుకున్న శివాజీ! కృష్ణ గారి ఫ్యాన్స్ వేరయా అంటున్న నటుడు!!

Published: 02-03-2026, 9:35 AM
షాకింగ్: చిరంజీవి కాళ్ళు పట్టుకున్న శివాజీ! కృష్ణ గారి ఫ్యాన్స్ వేరయా అంటున్న నటుడు!!
  • ఇంద్ర సినిమాలోని వీర మనోహర్ రెడ్డి పాత్రలో శివాజీ అద్భుత నటన!
  • ఇంటర్వెల్ సీన్ తర్వాత చిరంజీవి కాళ్ళు పట్టుకున్న శివాజీ సంచలన వ్యాఖ్యలు!
  • కృష్ణ గారి సినిమాలంటే రక్తపాతమే అనేంతటి అభిమానం ఉండేది: శివాజీ
  • మెగాస్టార్ ను కొట్టే సీన్ లో టెన్షన్ పడిన శివాజీ ఎమోషనల్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. నటుడు శివాజీ, చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంద్ర సినిమాలో శివాజీ సంచలన నటన

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో అద్భుతమైన మాస్ సినిమాలు ఉన్నాయి. గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపాయి. అదే విధంగా ఇంద్ర సినిమా కూడా చరిత్ర సృష్టించింది. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

నటుడు శివాజీ కీలక పాత్రలో మెరిశారు. వీర మనోహర్ రెడ్డి పాత్రలో శివాజీ నటించారు. ఇంటర్వెల్ సీన్ మొత్తం శివాజీ పాత్ర చుట్టూనే ఉంటుంది. చిరంజీవిని వెన్నుపోటు పొడిచే ఆ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఓ ఇంటర్వ్యూలో శివాజీ ఆ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి గురించి శివాజీ ఎమోషనల్ కామెంట్స్

రేయ్ వీర మనోహర్ రెడ్డి ఏంట్రా ఇంకా కుర్చున్నావ్.. పైకి లే అని ఆర్తి అగర్వాల్ అనగానే.. శివాజీ పైకి లేచి మెడలో ఉన్న పూల మాలని విసిరి కొడతాడు. చిరంజీవి ఆశ్చర్యంతో రేయ్ గిరి అని అనగానే.. ఏయ్ అంటూ శివాజీ కోపంగా అరుస్తాడు. ఆ సీన్ తర్వాత తాను చిరంజీవి గారి కాళ్ళు పట్టుకున్నట్లు శివాజీ తెలిపారు. ఏదో ఫ్లోలో అరిచేశా అని చిరంజీవి గారికి చెప్పా.

చిరంజీవి గారిని సినిమాలో అయినా సరే అలా అంటే అభిమానులు ఊరుకోరు కదా.. మిమ్మల్ని బెదిరించారా అని ఇంటర్వ్యూలో శివాజీకి ప్రశ్న ఎదురైంది. శివాజీ బదులిస్తూ లేదు.. అలా ఏమీ జరగలేదు. ఎందుకంటే అంత మూర్ఖంగా ఉండే అభిమానుల బ్యాచ్ తెలుగులో చాలా తక్కువ.

కృష్ణ గారి అభిమానుల గురించి శివాజీ మాటలు

అలాంటి అభిమానులు ఒకప్పుడు కృష్ణ గారికి ఉండేవారు. కృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంటే తప్పనిసరిగా రక్తపాతం జరిగేది. అలా ఉండేది కృష్ణ గారి సినిమాల హంగామా. అలాంటి అభిమానులు కృష్ణ గారికి మాత్రమే సొంతం అని శివాజీ అన్నారు.

శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.