|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ మూవీకి మెగాస్టార్ సర్ ప్రైజ్ వాయిస్ ఓవర్! ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!

Published: 18-12-2025, 4:24 AM
రవితేజ మూవీకి మెగాస్టార్ సర్ ప్రైజ్ వాయిస్ ఓవర్! ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా!
  • రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.
  • మెగాస్టార్ చిరంజీవి రవితేజ పాత్రను తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయనున్నారు.
  • గతంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కలిసి నటించారు.
  • ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ-గ్రూప్ సొంతం చేసుకోగా, సంక్రాంతికి విడుదల కానుంది.

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో కీలకమైన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ కు పండగ వాతావరణం నెలకొంది. ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

రవితేజ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలతో రవితేజ దూసుకు వెళ్తున్నారు. హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్లు అందర్నీ ఆకట్టుకున్నాయి.

చిరంజీవి వాయిస్ ఓవర్ తో పెరిగిన క్రేజ్

ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి కూడా వ‌ర్క్ చేయబోతున్నారట. ఈ సినిమాలో రవితేజ పాత్రను చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ వాయిస్ ఓవర్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

ఓటీటీ రైట్స్, సంక్రాంతి రిలీజ్ వివరాలు

దీంతో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రవితేజ కోసం చిరు వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు జీ-గ్రూప్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా జీ-స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రానుంద‌ట‌.

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో రవితేజ సినిమాకు మరింత బూస్ట్ లభించడం ఖాయం. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతి బరిలో నిలిచే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.