|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘జగదేక వీరుడు’ సీక్వెల్‌లో తమన్నానే హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన చిరు! మెగాస్టార్ సంచలన నిర్ణయం!

Published: 12-02-2026, 6:35 AM
షాకింగ్: 'జగదేక వీరుడు' సీక్వెల్‌లో తమన్నానే హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన చిరు! మెగాస్టార్ సంచలన నిర్ణయం!
  • చిరు కోరిక నెరవేరేనా? ‘జగదేక వీరుడు’ సీక్వెల్‌లో తమన్నా హీరోయిన్‌గా ఛాన్స్?
  • శ్రీదేవి తర్వాత తమన్నానే అతిలోక సుందరిగా చూడాలని మెగాస్టార్ ఆకాంక్ష!
  • రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే సీక్వెల్.. చిరు హీరోగా నటించేందుకు సిద్ధం!
  • రాంచరణ్, తమన్నా జోడీగా సీక్వెల్ చేసే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం.

తమన్నానే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. చిరంజీవి కెరీర్ లో గొప్ప చిత్రాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఒకటి. దీనిని ఆల్ టైం క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీదేవి, చిరంజీవి జంటగా నటించారు.

ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించాలని అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు. ఈతరం జగదేక వీరుడిగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నటిస్తే బావుంటుంది అని.. అతిలోక సుందరిగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తే బావుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.

‘జగదేక వీరుడు’ సీక్వెల్ దర్శకుడు ఎవరంటే?

అయితే చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ సీక్వెల్ చేయాల్సి వస్తే దర్శకుడు ఎవరు ? హీరో హీరోయిన్లు ఎవరు అని ప్రశ్నించారు.

చిరంజీవి సమాధానం ఇస్తూ.. దర్శకుడిగా రాఘవేంద్ర రావు మాత్రమే ఉండాలి. ఆయనకి ఆల్టర్ నేట్ ఎవరూ లేరు. ఆయన దర్శకుడు అయితేనే ఆ చిత్రానికి న్యాయం జరుగుతుంది. ఇక హీరో ఎవరంటారా నేనేం తక్కువా ? ఆ మూవీ సీక్వెల్ లో కూడా నేనే నటించగలను అని చిరంజీవి అన్నారు.

రాంచరణ్‌తో తమన్నా జోడీ.. చిరు ప్లాన్ B ఇదేనా?

ఇక హీరోయిన్ విషయానికి వస్తే శ్రీదేవి తర్వాత ఆ ప్రొఫెషనలిజం చూపించాలి అన్నా, బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలి అన్నా తమన్నాకే సాధ్యం. తమన్నా ఇక్కడ ఉంది అని మాట్లాడడం లేదు. మా అబ్బాయి చరణ్ తో కూడా తమన్నా డ్యాన్స్, సినిమాల గురించి మాట్లాడుతుంటాను. శ్రీదేవి తర్వాత అతిలోక సుందరి పాత్రకు న్యాయం చేయగలిగేది తమన్నా మాత్రమే అని చిరంజీవి అన్నారు. ఒక వేళ ఆ సినిమా నేను చేయకూడదు అని అనుకుంటే రాంచరణ్, తమన్నా కలసి చేస్తారు అని చిరంజీవి సరదాగా తెలిపారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తమన్నాకి హీరోయిన్ గా క్రేజ్ తగ్గింది. ఇలాంటి టైంలో తమన్నా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో నటించడం అంటే కుదరని పని అని చెప్పొచ్చు. బహుశా చిరంజీవి కోరిక నెరవేరకపోవచ్చు.

చిరంజీవి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. తమన్నా హీరోయిన్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.