
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తండ్రిగా తాను ఎప్పటికీ గర్వపడుతుంటానని, రామ్ చరణ్ క్రమశిక్షణ, కృషి అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Key Points
రామ్ చరణ్ సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తి చేసుకుంది.
చిరంజీవి తనయుడి క్రమశిక్షణ, కృషి, పట్టుదలను అభినందించారు.
రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత' 18 ఏళ్ల క్రితం విడుదలైంది.
ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలో నటిస్తున్నారు, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.
రామ్ చరణ్ సినీ ప్రయాణం 18 ఏళ్లు
మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. ‘చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు’ అంటూ పోస్ట్ చేశారు.
చిరుతతో మొదలైన చెర్రీ కెరీర్
రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.
తండ్రి చిరంజీవి అందించిన ఈ ప్రేమ, ఆశీస్సులు రామ్ చరణ్‌కు మరింత స్ఫూర్తిని ఇస్తాయని చెప్పొచ్చు. తన సినీ ప్రయాణంలో మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మెగా వారసుడికి శుభాకాంక్షలు.


