
📌 Key Points
- చిరంజీవికి కారు ఇస్తానని మాట తప్పిన నిర్మాత నారాయణ!
- తండ్రి వెంకటరావు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో చిరు ఆనందానికి అవధుల్లేవ్!
- ఫియెట్ కారుతో సురేఖతో కలిసి చెన్నై వీధుల్లో చిరు షికార్లు!
- మారుతి 800 రాకతో ఫియెట్ కారుకున్న క్రేజ్ తగ్గిపోయింది!
మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ సంచలన వార్త! కారు కొంటానంటే మాట తప్పిన నిర్మాత.. చిరు కన్నీళ్లు పెట్టుకున్నారా? పూర్తి వివరాల్లోకి వెళ్తే షాక్ అవుతారు!
కారు ఇస్తానని మోసం చేసిన నిర్మాత!
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మెగా అనే మహా వృక్షంలా ఎదిగారు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీగా నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా మంది హీరోలు సినిమాల్లోకి వచ్చారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు దాదాపు పది మంది వరకు హీరోలున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్‌గా రాణిస్తున్నారు చిరంజీవి. ఇటీవల ఆయన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో ఇండస్ట్రీ హిట్‌ని కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇదిలా ఉంటే చిరంజీవి జీవితంలో కారుకి ప్రత్యేక స్థానం ఉంది. దాని వెనుక ఎప్పటికీ మర్చిపోలేని మెమోరీస్ ఉన్నాయి. మరి ఇంతకి చిరంజీవి ఫస్ట్ కారు ఎప్పుడు కొన్నారు. దాని వెనుక ఉన్నకథ తెలిస్తే అయ్యో అనాల్సిందే. ఎందుకంటే ఓ నిర్మాత చిరంజీవిని ఛీట్ చేశారు. కారు గిఫ్ట్ గా ఇస్తానని మాట మార్చారు. ఆ సమయంలో చిరంజీవికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు ఆయన తండ్రి వెంకటరావు. ఆ కథేంటో చూస్తే, చిరంజీవి 1978లో నటుడిగా మారారు. `పునాది రాళ్లు` ఆయన తొలి చిత్రమైనా, `ప్రాణం ఖరీదు` మొదట విడుదలయ్యింది. ఆ తర్వాత ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు చేశాడు చిరంజీవి.
చిరంజీవికి తండ్రి ఇచ్చిన అదిరిపోయే గిఫ్ట్!
1979లోనే `ఐ లవ్ వ్యూ` అనే చిత్రంలో నటించారు చిరు. ఈ సినిమా నిర్మాత నారాయణకి ఫియెట్ కారు ఉండేదట. అది చూసి చిరంజీవి ముచ్చటపడ్డారట. భలే ఉందనుకునేవాడట. ఆ విషయం నిర్మాత నారాయణకు తెలిసింది. దీంతో ఈ సినిమాలో నీ యాక్టింగ్ నన్ను ఇంప్రెస్ చేస్తే ఈ ఫియెట్ కారుని గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పాడట. దీంతో సంబర పడ్డ చిరంజీవి.. ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డాడట. అందరి కంటే ముందే వచ్చి రిహార్సల్స్ చేయడం, సినిమా పనుల్లో భాగం కావడం ఇలా చాలా కష్టపడ్డాడట. కానీ సినిమా రిలీజ్ అయ్యాక నిర్మాత మాట నిలబెట్టుకోలేదట. తనకు కారు ఇవ్వలేదు. దీంతో చాలా డిజప్పాయింట్ అయ్యాడట.
చిరంజీవి బాధపడటం చూసిన తండ్రి వెంకటరావు ఆయనకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తన సొంత డబ్బులతో ఏకంగా కొత్తగా ఫీయెట్ కారు కొని గిఫ్ట్ గా ఇచ్చాడట. అలా చిరంజీవి మొదటిసారి కారు కొన్నారు. ఆ కారుతోనే ఫ్యామిలీ అంతా కలిసి తిరిగారని, పెళ్లి వరకు అదే కారు మెయింటేన్ చేసినట్టు తెలిపారు చిరంజీవి. భార్య సురేఖతో కలిసి చెన్నైవీధుల్లో షికార్లు కొట్టారట. ఆ తర్వాత మార్కెట్‌లోకి కొత్తగా మారుతి 800 వచ్చింది. అది చాలా స్పీడ్ వెళ్తుంది. అది చూసి ఇంప్రెస్ అయ్యారట. టాలీవుడ్‌లో మొదటిసారి ఆ కారు కొన్నది తనే అని తెలిపారు చిరు. అంతేకాదు తన సొంత డబ్బులతో ఆ కారుని కొన్నాడట. మొదట్లో కార్లంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, ఆ తర్వాత ఒక్కో కారుపై ఆసక్తి ఏర్పడిందని చెప్పారు చిరు. ఫస్ట్ టైమ్ ఓ టీవీకి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ అరుదైన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఫియెట్ కారుతో చిరు, సురేఖల షికార్లు!
ఆ తర్వాత చిరంజీవి ల్యాండ్ క్రూజర్, మెర్సిడేజ్ బెంజ్, టొయోటో సెర, వింగ్స్, హోండా ఆకర్డ్ వంటి కార్లు కొన్నారు. ప్రస్తుతం ఆయన వద్ద బెంజ్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ఇక చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వరప్రసాద్ గారు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దీనికి దర్శకత్వం వహించారు. వెంకటేష్ స్పెలష్ రోల్ చేసిన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. దాదాపు మూడు వందల కోట్ల వరకు వసూళ్లని రాబట్టి రీజనల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నారు. అలాగే జులైలో `విశ్వంభర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.
చిరంజీవి గారి జీవితంలోని ఈ సంఘటన ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ! ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


