
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి, లిటిల్ చాంప్ వరుణవి ఆత్మీయ కలయిక.
- జీ తెలుగు ‘సరిగమప లిటిల్ చాంప్స్’ వేదికగా ప్రత్యేక క్షణాలు.
- వరుణవి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన చిరంజీవి, అండగా నిలుస్తానని హామీ.
- అనిల్ రావిపూడి చొరవతో సాధ్యమైన అద్భుత క్షణం, ప్రోమో వైరల్.
మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే! తాజాగా జీ తెలుగు ‘సరిగమప’ షోలో ఓ చిన్నారిని కలిసిన ఆయన వీడియో ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతోంది. చిరు చేసిన అద్భుతమైన పనికి అభిమానులు మురిసిపోతున్నారు. వివరాలు ఇక్కడ చూసేయండి!
చిరుతో వరుణవి మధుర జ్ఞాపకాలు!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి ప్రేరణ. సినిమాల్లోనే హీరోగా కాకుండా బయట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలతో, అభిమానులకు కూడా అండగా నిలుస్తూ రియల్ హీరో అని చాలా సందర్భాల్లో అనిపించుకున్నారు. ఇక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తో ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. చాలా మంది ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు చిరంజీవి.(Chiranjeevi)
తాజాగా చిరంజీవి ఓ చిన్నారిని కలిసిన వీడియో వైరల్ గా మారింది. జీ తెలుగు ఛానల్ లో సరిగమప లిటిల్ చాంప్ అనే ప్రోగ్రాం వస్తుంది. ఈ ప్రోగ్రాంలో వరుణవి అనే చాలా చిన్న పాప తన పాటలతో, ముద్దు ముద్దు మాటలతో అందర్నీ మెప్పిస్తుంది. తనకు కంటికి సంబంధించిన సమస్య ఉన్నా కూడా పాటలతో అందర్నీ అలరిస్తుంది.
మెగాస్టార్ ఇచ్చిన మాట.. వైరల్!
ఇప్పటికే ఈ ప్రోగ్రాంతో వరుణవి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈ షోకి జడ్జి గా చేస్తున్న అనిల్ రావిపూడి ఇటీవల చిరంజీవిని కలిపిస్తా అని వరుణవికి చెప్పాడు. చెప్పినట్టే చిరంజీవిని కలిపించారు.
చిరంజీవి చిన్నారి వరుణవిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని సరదాగా మాట్లాడారు. వరుణవి చిరంజీవి పాటలు, డైలాగ్స్ చెప్పి మెగాస్టార్ ని మెప్పించింది. చిరు సైతం ఆ చిన్నారి ట్యాలెంట్ కి అబ్బురపోయాడు. దాంతో ఆ చిన్నారికి భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని మాట ఇచ్చాడు. వరుణవి చిరంజీవిని కలిసిన విజువల్స్ ప్రోమోలో వేయగా ఈ ప్రోమో వైరల్ గా మారింది.
ఇదే కదా మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్ సంబరం!
ఇది కదరా మెగాస్టార్ అంటే, చిరు మంచితనం అని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి చిరంజీవిని అభినందిస్తున్నారు. ఇక చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. చిరంజీవి చిన్నారి వరుణవిని కలిసిన విజువల్స్ మీరు కూడా చూసేయండి..
మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం మరోసారి అందరి మనసులు గెలుచుకుంది. ఈ అద్భుతమైన సంఘటనతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. చిరు మరిన్ని ఆసక్తికర అప్డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


