
📌 Key Points
- చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం రూ. 70-75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
- మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
- చిరు కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం అని, టాప్ హీరోలతో పోటీ పడుతున్నారని సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 70-75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తాజా వార్తలు వెలువడ్డాయి. ఈ మెగా ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా రాబోతోంది.
‘మన శంకర వరప్రసాద్ గారు’: అంచనాలు, కాస్ట్ & క్రూ
మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు పేరుగాంచిన అనిల్ రావిపూడి (Anil Ravipudi)తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.’సైరా’ తర్వాత మళ్లీ చిరంజీవితో ఆమె జత కడుతుండటం మూవీపై మరింత క్రేజ్ తెచ్చింది. అలాగే.. వీటీవీ గణేష్, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్, రేవంత్ భీమల, ‘దసరా’ ఫేం షైన్ టామ్ చాకో వంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
చిరంజీవికి కెరీర్‌లోనే భారీ రెమ్యునరేషన్
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇందులోంచి విడుదల ‘మీసాలపిల్ల’ సాంగ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజా, సమాచారం ప్రకారం.. చిరంజీవి ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 70-75 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యధికమని తెలుస్తోంది.
చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ & ఇతర వివరాలు
టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యునరేషన్ 60 కోట్ల నువచి 120 కోట్ల మధ్యలో ఉండగా.. చిరు తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరు పెద్ద కూతురు సుస్మిత కొణెదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరు దసరా ఫేమ్ ఓదెల శ్రీకాంత్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటికీ ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు. ఇక చిరు ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలతో పోటీపడుతున్నారు.
చిరంజీవికి కెరీర్‌లోనే రికార్డు స్థాయి రెమ్యునరేషన్ లభిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంటారా లేదా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


