
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్!
- చిరంజీవి మేనకోడలు నైరా పాడిన ‘ఫ్లై హై’ సాంగ్ వీడియో వైరల్.. ఆమె సింగపూర్ లసలా కాలేజ్ విద్యార్థి!
- నైరా.. చిరంజీవి చెల్లెలు మాధవి రావు కూతురు.. త్వరలోనే టాలీవుడ్ సింగర్ గా ఎంట్రీ ఇవ్వనుంది!
- చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ బాధ్యతలు చూసుకుంటున్న మాధవి రావు.. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కనిపించే డాక్టర్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన విషయం దాగి ఉంది. అదేంటంటే ఈ సినిమాలో ఓ పాటను చిరంజీవి మేనకోడలే పాడింది!
చిరంజీవి సినిమాలో పాడిన సింగర్ ఎవరో తెలుసా?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పండక్కి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాతో చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.(Chiranjeevi)
అయితే ఈ సినిమాలో చిరంజీవి తన పిల్లలతో స్కూల్ లో ఉండే కొన్ని సన్నివేశాల్లో ఒక పాప్ సాంగ్ వస్తుంది. ఈ పాటని పాడింది ఎవరో కాదు చిరంజీవి మేనకోడలు. ఈ విషయాన్ని ఇంతకుముందే అనిల్ రావిపూడి ప్రకటించాడు.
మెగాస్టార్ మేనకోడలు టాలీవుడ్ ఎంట్రీ.. వివరాలివే!
మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి ఫ్లై హై అనే సాంగ్ కి సంబంధించిన వీడియో, ఆ పాట పాడిన సింగర్ తన గురించి చెప్తున్నా ఓ వీడియోని మూవీ టీమ్ షేర్ చేసారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి మాట్లాడుతూ.. నా పేరు నైరా అని, ఈ పాట పాడింది నేనే అని, సింగపూర్ లోని లసలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుతుందని, ఒక పాప్ మ్యూజిక్ స్టూడెంట్ అని, ఈ సినిమాతో సింగర్ గా టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చానని తన గురించి తెలిపింది.
అయితే ఈ వీడియోని షేర్ చేస్తూ అనిల్ రావిపూడి.. నైరా చిరంజీవి గారి మేనకోడలు. చిరంజీవి చెల్లి మాధవి గారి కూతురు. సినిమాలో ఫ్లై హై సాంగ్ చాలా బాగా పాడింది. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే తనకు ఇంకా చాలా మంచి జర్నీ ఉంది అని ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
మాధవి రావు ఎవరు? చిరంజీవికి ఆమెకు సంబంధం ఏంటి?
చిరంజీవికి ఇద్దరు చెల్లెల్లు విజయ దుర్గ, మాధవి రావు. విజయ్ దుర్గ కొడుకులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ హీరోలు అని అందరికి తెలిసిందే. మాధవి రావు డాక్టర్. ఆమె డాక్టర్ గా పనిచేస్తూనే చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ని చూసుకుంటుంది. ఈమె గురించి ఎక్కువగా ఎవరికీ తెలీదు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈమె పిల్లల గురించి అసలు ఎవరికీ తెలీదు. ఇప్పుడు నైరా ఈ మాధవి రావు కూతురు అని, చిరంజీవి మేనకోడలు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
దీంతో నైరా మ్యూజిక్ నేర్చుకుంటుందని, త్వరలోనే సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ పరిశ్రమలోకి వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
మెగా ఫ్యామిలీ నుండి ఒక కొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. నైరా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


