
వర్ష బొల్లమ్మ నటించిన ‘కానిస్టేబుల్ కనకం’ ఓటీటీ సిరీస్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. చిరంజీవి ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఆగస్ట్ 14న ఈ సిరీస్ రిలీజ్ అవుతుంది.
Key Points
చిరంజీవి గారు 'కానిస్టేబుల్ కనకం' ట్రైలర్‌ను ప్రశంసించారు.
వర్ష బొల్లమ్మ నటించిన ఈ థ్రిల్లర్ ఆగస్ట్ 14న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో తెలుగు కంటెంట్‌కు మంచి స్పందన వస్తోందని చిరంజీవి అభిప్రాయం.
గ్రామీణ నేపథ్యంలో సాగే మహిళల మిస్సింగ్ కేసు నేపథ్యంలో ఈ సిరీస్ ఉంది.
చిరంజీవి ప్రశంసలతో ‘కానిస్టేబుల్ కనకం’
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించిన తొలి తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ కాప్ సస్పెన్స్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా ఈ ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
ఇటీవల కానిస్టేబుల్ కనకం ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కనకం ట్రైలర్ తనకు బాగా నచ్చిందని, అసలు విషయం ఏమి చెప్పకుండా ఇంట్రెస్టింగ్‌గా ప్రోమో కట్ చేసిన విధానం నచ్చిందని మెగాస్టార్ చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు.
కానిస్టేబుల్ కనకం ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందని, తదుపరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించే విధంగా ప్రతి సన్నివేశాన్ని కట్ చేశారని చిరంజీవి అన్నారు. “ఓటీటీ డామినేషన్ ఉన్న సమయంలో ఇంత స్టైలిష్‌గా తెలుగు కంటెంట్ తెరకెక్కుతుండటం ఆనందంగా ఉంది. వర్ష బొల్లమ్మ, శ్రీనివాస అవసరాల, రాజీవ్ కనకాల వంటి నటులు ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది” అని చిరంజీవి పేర్కొన్నారు.
ఆగస్ట్ 14న ఓటీటీలో ‘కానిస్టేబుల్ కనకం’
కానిస్టేబుల్ కనకం ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల ట్రాక్ తనకు బాగా నచ్చిందని చిరంజీవి తెలిపారు. చిరంజీవి ట్రైలర్ లాంచ్ చేయడం పట్ల వర్ష బొల్మమ్మ కూడా థ్రిల్ అయ్యిందని, ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక నిరాశ పరచదని, అందరిని కట్టిపడేసేంత సస్పెన్స్ ఈ షోలో ఉందని అన్నారు.
ఇకపోతే ఈటీవీ విన్‌లో కానిస్టేబుల్ కనకం ఓటీటీ రిలీజ్ కానుంది. ఆగస్ట్ 14 నుంచి కానిస్టేబుల్ కనకం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, మరో నాలుగు రోజుల్లో తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానుంది.
కాగా, కానిస్టేబుల్ కనకం ఓటీటీ సిరీస్‌లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ పోలీస్ పాత్రలో ఇంటెన్సివ్‌గా నటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామానికి బదిలీ అయిన వర్ష బొల్లమ్మ మహిళల మిస్సింగ్ కేసులో ఎలా ఇరుక్కున్నదనేదే ఈ సిరీస్ కథ.
ఓటీటీ డామినేషన్‌పై చిరంజీవి అభిప్రాయాలు
అమ్మాయిలు మిస్ అవ్వడాన్ని గ్రామస్తులు శాపంగా భావిస్తుండటంతో పోలీసులు ఆ కేసును పట్టించుకోరు. కానీ, వర్ష పాత్ర మాత్రం కేసును తన చేతుల్లోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది.
ఆ తర్వాత ఏమైంది?, కానిస్టేబుల్ కనకం అమ్మాయిల మిస్సింగ్ కేసును ఎలా చేధించింది?, ఎలాంటి విషయాలు తెలుసుకుంది దాని వెనుక ఎవరున్నారనే? అంశాలు తెలియాలంటే ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కానిస్టేబుల్ కనకం సిరీస్ చూడాల్సిందే.
మొత్తంమీద, ‘కానిస్టేబుల్ కనకం’ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉందని తెలుస్తోంది. చిరంజీవి ప్రశంసలతో ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి.


