|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెష‌ల్.. మెగాస్టార్ టాప్-5 సినిమాలు.. కోట్లు కుమ్మ‌రించిన మూవీస్‌..రెండు ఫ్లాప్‌లు కూడా..ఏ ఓటీటీలో?

Published: 22-08-2025, 12:42 AM
చిరంజీవి బ‌ర్త్‌డే స్పెష‌ల్.. మెగాస్టార్ టాప్-5 సినిమాలు.. కోట్లు కుమ్మ‌రించిన మూవీస్‌..రెండు ఫ్లాప్‌లు కూడా..ఏ ఓటీటీలో?

ఎలాంటి నేపథ్యం లేకుండా సినీ రంగానికి వచ్చి, మెగాస్టార్ అయిన చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకల్లో, ఆయన కెరీర్‌లోని అత్యధిక వసూళ్లు సాధించిన ఐదు సినిమాల గురించి మరియు వాటిని ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం.

Key Points

1

చిరంజీవి టాప్ 5 సినిమాలు వసూళ్ల వివరాలు

2

ప్రతి సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు

4

మెగాస్టార్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కథనం

చిరంజీవి అత్యధిక వసూళ్లు సాధించిన 5 సినిమాలు

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఎంతో మందికి బ్యాక్ బోన్ గా మారారు చిరంజీవి. ఒక మాములు మనిషి మెగా స్టార్ కాగలడు అని నిరూపించారు చిరంజీవి. యాక్టింగ్ తో, డ్యాన్స్ తో , ఫైట్స్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు 70వ పుట్టిన రోజు జరుపుకొంటున్న ఆయన అదే ఎనర్జీతో సినిమాల్లో అదరగొడుతున్నారు. ఇవాళ (ఆగస్టు 22) చిరంజీవి బర్త్ డే. ఆయన కెరీర్ లోని టాప్-5 అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు, వాటి ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.

స్వతంత్ర సమర యోధుడు, బ్రిటీష్ వాళ్లపై పోరాట బావుటా ఎగరవేసిన తెలుగు ఉద్యమ కారుడు ఉయ్యలావాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వచ్చిన మూవీ ‘సై రా నరసింహా రెడ్డి’. ఈ మూవీకి చిరంజీవి కెరీర్ లో స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఫిల్మ్ ఇదే. 2019లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.244 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉంది.

ప్రతి సినిమాకు సంబంధించిన ఓటీటీ వివరాలు

కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో వచ్చిన మూవీ ‘ వాల్తేరు వీరయ్య ’. ఇందులో చిరంజీవి, రవితేజ బ్రదర్స్ గా నటించారు. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 2023లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.232 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ లో ఉంది.

రైతుల కష్టాలను కళ్లకు కట్టిన సినిమా ‘ఖైదీ నంబర్ 150’. ఇది మెగా స్టార్ రీ ఎంట్రీ మూవీ కూడా. ఇందులో డ్యుయల్ రోల్ ప్లే చేశారు మెగా స్టారు. 2017లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.164 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. రీ ఎంట్రీలోనూ బాస్ గ్రేస్ తగ్గలేదని చాటిన మూవీ ఇది. దీన్ని జియోహాట్‌స్టార్‌ లో చూడొచ్చు.

చిరంజీవి కెరీర్ లోని విజయాలు మరియు వైఫల్యాలు

ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ ‘గాడ్ ఫాదర్’. పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్, పొలిటికల్ లీడర్ గా ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ అదిరిపోయింది. 2022లో వచ్చిన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో చిరంజీవి సోదరిగా నయనతార నటించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఉంది.

థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన మూవీ ‘ఆచార్య’. కానీ ఈ సినిమాలో కొడుకు రామ్ చరణ్ తో కలిసి చిరంజీవి యాక్టింగ్ చేయడంతో ఇది స్పెషల్ గా నిలిచిపోయింది. 2022లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టగలిగింది. దీని బడ్జెట్ రూ.130 కోట్లు. ఈ సినిమాలో నక్సలైట్ గా నటించారు చిరు. ఈ మూవీని జీ5, ప్రైమ్ వీడియో ఓటీటీల్లో చూడొచ్చు.

చిరంజీవి సినీ ప్రయాణం ఎన్నో విజయాలతో పాటు కొన్ని వైఫల్యాలను కూడా చూసింది. అయితే, ఆయన అభిమానుల హృదయాలలో ఎల్లప్పుడూ మెగాస్టార్‌గానే నిలిచిపోతారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.