
మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. 11 రోజుల్లోనే 3.4 కోట్ల వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొడుతోంది. చిరు గ్రేస్, నయనతార కోపంతో కూడిన ఈ పాట లిరిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Key Points
మెగాస్టార్ చిరంజీవి ‘మీసాల పిల్ల’ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.
పాట విడుదలైన 11 రోజుల్లోనే 3.4 కోట్ల వ్యూస్‌ను దాటింది.
నయనతారను ఉద్దేశించి సాగే ఈ పాటలో చిరు గ్రేస్ అద్భుతం.
ఈ వైరల్ సాంగ్ పూర్తి లిరిక్స్ ఇక్కడే పొందండి.
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘మీసాల పిల్ల’ హవా
మీసాల పిల్ల అంటూ మెగాస్టార్ చిరు పాట పాడుతూ, స్టెప్పేస్తే యూట్యూబ్ షేక్ అవుతోంది. చిరంజీవి అంటేనే గ్రేస్ గాడ్. ఆయన అప్ కమింగ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీలోని మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడున్నాయి. మీరూ పాడేయండి.
మీసాల పిల్ల అంటూ నయనతార వెనకపడుతున్నాడు చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల అదరగొడుతోంది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది ఈ సాంగ్. పాట రిలీజై 11 రోజులవుతోంది. ఇప్పటికే 3.4 కోట్ల వ్యూస్ వచ్చాయి.
మీసాల పిల్ల సాంగ్ లిరిక్స్
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా..
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్లా
పొద్దున లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల
మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళ
అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా…
ఇట్టా దుమ్మెత్తి పొయ్యలా దూరాలే పెంచేలా
కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా..
నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
చిరు గ్రేస్, నయనతార కోపంతో అదరగొడుతున్న పాట
అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల
నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..
గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..
మీసాల పిల్ల.. నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
ఆ ఎదురింటి యెంకట్రావ్ కుళ్లుకు సచ్చుంటాడు
పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడు
వాడు యేట్లో కొట్టుకు పోను…
ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడు
నువ్వింత హార్ష్ గా మాటడాలా
‘మీసాల పిల్ల’ సాంగ్ పూర్తి లిరిక్స్ ఇక్కడ!
ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా
నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా
నీ ముక్కు మీద కోపం కొంచం తగ్గలే పిల్ల..
నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
రాజి పడదామంటే రావే మాజీ ఇల్లలా
నువ్వు రోజు పెట్టె నరకంలోకి మళ్ళి దూకాల
అబ్బా పాతవన్ని తొడాల నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత నీకు మేనత్త అయ్యేలా
హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఇన్ని సార్లు డోరె వెయ్యలా..
హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..
చిరంజీవి స్టైల్, నయనతార భావాలతో కూడిన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రజాదరణ పొందుతోంది. ఈ పాట సినిమాపై అంచనాలను పెంచుతూ, మెగాస్టార్ మానియాను మరోసారి రుజువు చేసింది.


