
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం 2026 చివరిలో విడుదల, భారీ VFX హంగులతో చందమామ కథలా ఉండనుంది!
- ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రం కూడా 2026 చివరిలో విడుదల కానుంది, ఇది ఒక ఎమోషనల్ వార్ డ్రామా!
- చిరంజీవి సరసన త్రిష, ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తుండగా, కీరవాణి, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
- 2026లో మెగాస్టార్, రెబల్ స్టార్ సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
టాలీవుడ్ ప్రేక్షకులకి ఇది నిజంగా పండగలాంటి వార్త! మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇద్దరూ 2026లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం!
చిరంజీవి ‘విశ్వంభర’: భారీ అంచనాలు!
Chiru- Prabhas; మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2026 ప్రథమార్ధంలో ఇప్పటికే కొన్ని భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక ఈ ఏడాది ద్వితీయార్ధంలో మెగాస్టార్ చిరంజీవి తన సోషియో-ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో, ప్రభాస్ పీరియడ్ వార్ డ్రామా ‘ఫౌజీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో వస్తుండటంతో టాలీవుడ్‌లో సరికొత్త జోష్ నెలకొంది.
ముందుగా మెగాస్టార్ నటిస్తున్న ‘విశ్వంభర’ విషయానికొస్తే.. ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ వీఎఫ్ఎక్స్ హంగులతో, హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను అద్భుతమైన ‘చందమామ కథ’లా తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ సినిమాను 2025 సంక్రాంతికి అనుకున్నప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం కారణంగా 2026 సమ్మర్ లేదా జూలై నెలకు వాయిదా వేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం (Chiru- Prabhas)పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా, 2026 ఇయర్ ఎండింగ్ నాటికి ఈ గ్రాండ్ మూవీ వెండితెరపై మెరవనుంది. ఇందులో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రభాస్ ‘ఫౌజీ’: వార్ డ్రామాతో సంచలనం!
మరోవైపు ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పౌజీ’. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ వార్ డ్రామాగా ఈ సినిమాగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 ఆగస్టు లేదా దసరా సీజన్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్రాథమికంగా భావించారు. కానీ, చిత్రం షూటింగ్, గ్రాఫిక్ వర్క్స్ చాలా వరకు పెండింగ్ లో ఉందట. ఆ కారణంగానే 2026 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
2026 బాక్సాఫీస్ వార్: ఎవరు గెలుస్తారో?
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి పరిచయం అవుతుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం కూర్చుతున్నారు. ఇలా మెగాస్టార్ సోషియో-ఫాంటసీ మ్యాజిక్, ప్రభాస్ పీరియడ్ వార్ యాక్షన్ రెండు భిన్నమైన జోనర్లలో వస్తున్న ఈ సినిమాలు 2026 ఏడాది ఎండింగ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నాయి. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ రెండు సినిమాలు ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటాయి అనేది చూడాలి.
మెగాస్టార్, రెబల్ స్టార్ సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో టాలీవుడ్ లో సందడి నెలకొంది. ఈ రెండు చిత్రాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


