|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిట్టి గువ్వ సాంగ్ లిరిక్స్.. కోర్ట్ మూవీలోని గుండెను మెలిపెట్టే పాట మీకోసం..

Published: 30-04-2025, 12:41 PM
చిట్టి గువ్వ సాంగ్ లిరిక్స్.. కోర్ట్ మూవీలోని గుండెను మెలిపెట్టే పాట మీకోసం..

టాలీవుడ్ లో విజయవంతమైన కోర్ట్ సినిమాలోని ‘చిట్టి గువ్వ’ అనే గుండెను కదిలించే పాట లిరిక్స్ ఇక్కడ మీకోసం. విజయ్ బుల్గానిన్ సంగీతం, పూర్ణాచారి సాహిత్యంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Key Points

1

కోర్ట్ సినిమాలోని 'చిట్టి గువ్వ' పాట లిరిక్స్ ఇక్కడ ఉన్నాయి.

2

విజయ్ బుల్గానిన్ సంగీతం, పూర్ణాచారి సాహిత్యం, కాలభైరవ గానం.

4

కోర్ట్ సినిమా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది.

చిట్టి గువ్వ పాట వివరాలు

టాలీవుడ్ లో ఓ చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. మూవీతోపాటు ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమలో సాంగ్ మరో లెవెల్. దీంతోపాటు గుండెను మెలిపెట్టే ఓ శాడ్ సాంగ్ చిట్టి గువ్వ కూడా ప్రేక్షకులను బాగానే ఆకర్షించింది.

కోర్ట్ మూవీ కి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిట్టి గువ్వ పాటను పూర్ణాచారి రాశాడు. కాలభైరవ పాడాడు. రామ్ జగదీశ్ డైరెక్ట్ చేసిన ఈ కోర్ట్ మూవీలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి నటించారు. ఈ మూవీలోని ప్రేమలో సాంగ్ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే ఈ చిట్టి గువ్వ పాట కూడా ఆకట్టుకునేలానే ఉంది.

కోర్ట్ మూవీ ఓ ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. చిన్నారులపై లైంగిక దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించడానికి తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీకి అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

చిట్టి గువ్వా.. ఊరుకోవే..

ఏ వెలుగులో కనిపించని గీతే గీశారా

ఏం తెలియక దాటడమే నేరం అంటారా

ఏ న్యాయం నీ కోసం సాయం రాలేదా

కోర్ట్ మూవీ గురించి

ఈ ప్రశ్నలు అడగాలని ఆశగ చూశావా

చిట్టి గువ్వా.. ఊరుకోవే..

చిట్టి గువ్వా.. ఊరుకోవే..

రాలే చినుకుల్లో అన్ని రంగులు చూశావా

దూకే పిడుగుల్నే తట్టుకోవా

వీచే గాలుల్లో చిన్ని చిందులు వేశావా

అమ్మా అంటే ఏరా అంటూ ఆమె నోటి మాట

పాట లిరిక్స్

చెమ్మగిల్లే కళ్లల్లోనే పాపం ఆగిపోయేనంటా

చుక్క రాలి ఆకాశాల దారే వీడిపోతూ ఉన్నా

చెప్పలేని బాధే మౌనంగానే మోసే జాబిలమ్మా

ఏ జాలిని చూపించని వలయం ప్రేమా..

చిట్టి గువ్వా.. ఊరుకోవే..

చిట్టి గువ్వా.. ఊరుకోవే..

కోర్ట్ సినిమా విజయానికి ‘చిట్టి గువ్వ’ పాట కూడా దోహదపడింది. ఈ పాట లిరిక్స్ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.