|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiyan Vikram: చియాన్ విక్రమ్ నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. డైరెక్టర్ ఎవరంటే?

Published: 31-05-2025, 11:49 AM
Chiyan Vikram: చియాన్ విక్రమ్ నెక్స్ట్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ‘వీర ధీర శూరన్-2’ తర్వాత, ఆయన మడోన్ అశ్విన్ తో ‘వీరమేజయం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు, ఆయన 65వ చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

Key Points

1

చియాన్ విక్రమ్ తదుపరి చిత్రం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో ఉండే అవకాశం.

2

‘96’ చిత్రంతో ప్రసిద్ధి చెందిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు.

4

ఫ్యాన్స్ లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రేమ్ కుమార్ తో విక్రమ్ సినిమా?

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyan Vikram) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది ‘వీర ధీర శూరన్-2’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ చిత్రం అనంతరం.. ఈయన తన తదుపరి మూవీ కోసం డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో చేతులు కలిపాడు. ‘వీరమేజయం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇంకా చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు విక్రమ్ 65వ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. చియాన్ విక్రమ్ తన 65వ మూవీని దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. 96 సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో చియాన్ విక్రమ్ సినిమా చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి వార్తలు వైరల్ అవుతుండగా.. ఓ మంచి లవ్ స్టోరీ ఇవ్వు అన్నా మా విక్రమ్ అన్నకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Director PremKumar Next Film 📽️ 96 director #PremKumar is going to shoot with #ChiyaanVikram next. #Chiyaan64 or #Chiyaan65 …? pic.twitter.com/57LO6fhKUS

విక్రమ్ 65వ చిత్రంపై అప్డేట్

ఫ్యాన్స్ అంచనాలు

చియాన్ విక్రమ్ మరియు ప్రేమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తే అది మంచి లవ్ స్టోరీగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.