
థియేటర్లలో ఆశించిన విజయం దక్కని ‘చౌర్యపాఠం’ సినిమా, ఓటీటీలో అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో అగ్రస్థానంలో ఉంది. ఈ విజయానికి కారణాలు ఏమిటో చూద్దాం.
Key Points
ఓటీటీలో ‘చౌర్యపాఠం’ సినిమా అనూహ్య విజయం సాధిస్తోంది.
200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
ఇంద్ర రామ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం ప్రశంసలు అందుకుంటోంది.
అనూహ్య విజయం
థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో విజయం సాధించని ఓ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది . పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది . ఆ చిన్న సినిమానే చౌర్యపాఠం . ఇటీవల ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది.
ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే… కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్
ఇంద్ర రామ్ నటన
చిన్న సినిమా అయినా, చౌర్యపాఠం కథ, నటన, దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఓటీటీలో నయా రికార్డు సృష్టించింది. ఈ విజయం తెలుగు సినిమా రంగం కోసం ఆశాజనకం.



Zareen Khan Blasts Photographer Over Inappropriate Remark, Video Goes Viral