|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంక్రాంతి రేసులో ఊహించని ట్విస్ట్! చిరుకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో.. బాక్సాఫీస్ రిపోర్ట్!

Published: 14-01-2026, 9:30 PM
సంక్రాంతి రేసులో ఊహించని ట్విస్ట్! చిరుకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో.. బాక్సాఫీస్ రిపోర్ట్!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీకి మొదటి రోజు భారీ కలెక్షన్లు, కానీ రెండో రోజు డ్రాప్!
  • శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టాక్ తో దూసుకుపోతోంది, యూత్ లో విపరీతమైన క్రేజ్!
  • సంక్రాంతి రేసులో ఐదు సినిమాలు పోటీ పడ్డాయి, థియేటర్ల వద్ద సందడి వాతావరణం!
  • వెంకటేష్ స్పెషల్ ఎంట్రీతో చిరంజీవి సినిమాకి అదనపు ఆకర్షణ, కామెడీ మరియు ఎమోషన్స్ హైలైట్!

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. టాలీవుడ్‌లో సందడి మొదలవుతుంది. ఈసారి ఐదు సినిమాలు పోటీ పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవికి కుర్ర హీరో షాక్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

చిరంజీవి సినిమాకి ఎదురుదెబ్బ!

సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. పండక్కి తీవ్ర పోటీ ఉండటం సహజమే. కానీ ఈ సారి అది ఎక్కువగా ఉంది. ఈ సారి ఐదు సినిమాలు విడుదలయ్యాయి. దీంతో థియేటర్ల వద్ద తీవ్ర పోటీ నెలకొంది. అయితే బుధవారంతో అన్ని సినిమాల విడుదల పూర్తయ్యింది. ఐదు సినిమాల ఫలితాలు వచ్చాయి. సంక్రాంతి విన్నర్‌ ఎవరో క్లారిటీ వచ్చింది. సినిమాలకు వస్తోన్న స్పందన (టాక్‌) ని బట్టి విజేత నిర్ణయించే టైమ్‌ వచ్చింది. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా టాప్‌లో ఉంది. ఏ హీరో ముందున్నాడనేది టాప్‌ 5 ఆర్డర్‌ ప్రకారం చూస్తే..

ఈ సంక్రాంతి విన్నర్‌ మెగాస్టార్‌ చిరంజీవి విజేతగా చెప్పొచ్చు.  ఈ సంక్రాంతికి ఆయన నటించిన `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీ విడుదలయ్యింది. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్‌ స్పెషల్‌ ఎంట్రీతో దుమ్ములేపారు. సినిమాకి మొదటి షో నుంచే బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. కలెక్షన్లు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ అంశాలు, కామెడీ, సెంటిమెంట్‌, ఎమోషన్స్, యాక్షన్‌, వెంకీ స్పెషల్‌ ఎంట్రీ ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందిన ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తనలోని వింటేజ్‌ లుక్‌ని, స్టయిల్‌ని బయటకు తీసి చిరంజీవి చేసిన రచ్చ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సంక్రాంతికి విన్నర్‌గా నిలిపిందని చెప్పొచ్చు. టాప్‌ 5లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.

శర్వానంద్ మూవీ కలెక్షన్ల సునామీ!

ఆ తర్వాత కుర్ర హీరో శర్వానంద్‌ నటించిన `నారీ నారీ నడుమ మురారి` మూవీ ఉంటుంది. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ బుధవారం సాయంత్రం నుంచి విడుదలయ్యింది. క్రేజీ అండ్‌ హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది విశేషంగా ఆకట్టుకుంటుంది. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఇది అటు ట్రెండీగా ఉండటంతోపాటు జెంజీ ఆడియెన్స్ కి కూడా నచ్చేలా ఉండటం విశేషం. టీవీ పంచ్‌లు, సోషల్‌ మీడియా పంచ్‌లతో అదిరిపోయేలా రూపొందించాడు దర్శకుడు. శర్వానంద్‌ కూడా అదే రేంజ్‌లో చేశారు. ఇద్దరి అమ్మాయి మధ్య నలిగిపోయే సీన్లు సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. దీనికితోడు నరేష్‌ కామెడీ  సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఇది చిరంజీవి `మన శంకర వర ప్రసాద్‌ గారు`ని కూడా డామినేట్‌ చేసే స్థాయిలో ఉండటం విశేషం. చిరంజీవి మూవీ తర్వాత దీనికి రెండో స్థానం దక్కుతుంది. కానీ ఆ మూవీని దాటినా ఆశ్చర్యం లేదు.

మూడో స్థానంలో నవీన్‌ పొలిశెట్టి నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ నిలుస్తుంది. మారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య మరో నిర్మాత. ఈ సినిమా బుధవారం విడుదలయ్యింది. పర్‌ఫెక్ట్ సంక్రాంతి పండగ సినిమాలా దీన్ని రూపొందించారు. అమ్మాయి కోసం హీరో పడే పాట్లు, ఆస్తి కోసం ఆయన వేసిన స్కెచ్‌, ఎన్నికల్లో పోటీ కోసం ఎత్తులకు పై ఎత్తులు, ఇలా విలేజ్‌ పాలిటిక్స్ ని తలపించేలా ఆద్యంతం సందడిలా ఈ మూవీ సాగుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే రొటీన్‌ అంశాలు, బలవంతపు కామెడీ దీన్ని మూడో స్థానంలో నిలిపాయి.

టాప్ 5 మూవీస్.. ఏది నంబర్ 1?

నాల్గో స్థానం మాస్‌ మహారాజా రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` నిలుస్తుంది. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఇందులో డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. ఇది కూడా లవర్‌కి, భార్యకి మధ్య నలిగిపోయే భర్త కాన్సెప్ట్ తోనే రూపొందింది. సత్య కామెడీ, రవితేజ వింటేజ్‌ ఫన్‌, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే సీన్లు, సోషల్‌ మీడియా పంచ్‌లు ఈ మూవీలో హైలైట్‌గా చెప్పొచ్చు. కొంత వరకు నవ్వించింది. ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. సంక్రాంతి పండగ కాబట్టి బాగానే ఆడే అవకాశం కనిపిస్తుంది.

ఈ సంక్రాంతికి చివరి స్థానంలో నిలిచిన సినిమా ప్రభాస్‌ హీరోగా వచ్చిన `ది రాజా సాబ్‌`. నిజానికి ఇది యావరేజ్‌ నుంచి ఎబౌ యావరేజ్‌ మూవీ. ఆడియెన్స్ దీన్ని రాంగ్‌గా తీసుకున్నారు. మొదటి రోజు తీవ్రమైన నెగటివిటీ దీన్ని దెబ్బకొట్టింది. ఆ తర్వాత కొన్ని మార్పులు చేయడంతో సినిమా బెటర్‌గానే ఉంది. కానీ అప్పటికే వచ్చిన నెగటివ్‌ టాక్‌ గట్టి ప్రభావం చూపించింది. దీంతో `ది రాజా సాబ్‌` చివరి స్థానానికి పరిమితమయ్యింది. అయితే ఇది ఇప్పటికే రెండు వంద కోట్లు దాటేయడం విశేషం. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్‌ నెగటివ్‌ రోల్‌ చేశారు. మొత్తంగా ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో ఇది ఐదో స్థానానికి పరిమితమయ్యిందని చెప్పొచ్చు.

సంక్రాంతి సినిమాల కలెక్షన్ల గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.