
📌 Key Points
- ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో 332.1 కోట్ల గ్రాస్ వసూళ్లు. సంచలన రికార్డు.
- సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 440 కోట్ల గ్రాస్ అవసరం. టార్గెట్ ఫిక్స్.
- కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’. మరిన్ని ప్రాంతాలు ఎదురుచూపు.
- రామ్‌చరణ్ నటన, క్రీడా నేపథ్యం, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం సాధించిన వసూళ్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
పెద్ది బాక్సాఫీస్ దూకుడు: ఆరు రోజుల వసూళ్లు!
Peddi Collections : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించింది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ వచ్చింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను పంచుకుంది.
రామ్‌చరణ్ నటన, గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు నిర్మించారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్: ఇంకెంత కావాలి?
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమాకు దాదాపు 218.50 కోట్ల థియేటరికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 220 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అంటే కనీసం 440 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇప్పటి వరకు 332 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అంటే ఈ లెక్కన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాంటే మరో 108 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయాల్సి ఉంటుంది.
మెగా పవర్ స్టార్ మ్యాజిక్: ప్రేక్షకుల స్పందన!
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మిగిలిన చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మరో నాలుగు లేదా ఐదు రోజుల్లో మిగిలిన చోట్ల కూడా బ్రేక్ ఈవెన్‌ను సాధించే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తూ, మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా పయనిస్తోంది. రామ్‌చరణ్ మానియా ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!


