|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ

Published: 12-12-2025, 8:48 AM
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
  • ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150-200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
  • అల్లు అర్జున్ ‘పుష్ప 2’, విజయ్ ‘జన నాయకుడు’ చిత్రాలకు రూ.200 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారు.
  • ‘జైలర్’ సంచలన విజయంతో రజనీకాంత్ రూ.250 కోట్ల భారీ పారితోషికం అందుకున్నారు.
  • సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్క హీరోగా రజనీకాంత్ సంచలనం సృష్టించారు.

సౌత్ ఇండియన్ సినిమాలో హీరోల పారితోషికాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ వంటి స్టార్ల కంటే అత్యధికంగా పారితోషికం అందుకున్న ఒకే ఒక్క స్టార్ ఎవరు? రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో ఎంత సంపాదించారో తెలుసుకోండి.

ప్రస్తుత సౌత్ స్టార్ల భారీ పారితోషికం

సౌత్‌ ఇండియన్‌ సినిమాలో ఇప్పుడు బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా హీరోగా ప్రభాస్‌ పేరు వినిపిస్తోంది. కానీ ఆయన ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.150 కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. మన వద్ద ఎక్కుక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలుస్తున్నారు. మిగిలిన ఏ హీరో కూడా తీసుకోనప్పుడు డార్లింగ్‌కి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ప్రభాస్‌ నిలిచారని చెప్పొచ్చు.

ఇక ఆయన తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్‌ కూడా చేరిపోయారు. `పుష్ప 2` తో కలెక్షన్లు సునామీ సృష్టించిన బన్నీ.. ఈ మూవీకి గట్టిగానే తీసుకున్నారు. కలెక్షన్లలో షేర్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన అట్లీ సినిమాకి రెండు వందల కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌ కంటే ఎక్కువ తీసుకుంటున్నారని అంటున్నారు.

రజనీకాంత్: అత్యధిక పారితోషికం అందుకున్న సూపర్ స్టార్

మరోవైపు కోలీవుడ్‌ స్టార్‌ తళపతి విజయ్‌ కూడా గట్టిగానే తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్న నేపథ్యంలో తన చివరి మూవీ `జన నాయకుడు` చిత్రానికి గట్టిగా ఇస్తున్నారట. ఈ చిత్రానికి రెండు వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతికి రాబోతున్న విషయంత తెలిసింది. విజయ్‌ రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇదే మూవీ చివరిది కావడంతో ఆయనకు కావాలనే ఎక్కువగా ఇస్తున్నట్టు సమాచారం.

కానీ వీరి ముగ్గురి కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరో ఉన్నారు. ఆయనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ప్రస్తుతం ఆయన రూ.150నుంచి రెండు వందల కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. అయితే `జైలర్‌` మూవీ విషయంలో మాత్రం భారీగా ముట్టింది. మొదట ఆయనకు రూ.150కోట్ల పారితోషికం ఇచ్చారు. కానీ ఆ మూవీ సంచలన విజయం సాధించడంతో మరో వంద కోట్లు అదనంగా పారితోషికం ఇచ్చారు సన్‌ పిక్చర్స్ అధినేత. దీంతో ఆయనకు ఆ సినిమాకి ఏకంగా రూ.250కోట్లు ముట్టిందని చెప్పొచ్చు. ఇలా సౌత్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్‌ సంచలనం సృష్టించారు.

‘జైలర్’తో రజనీకాంత్ రికార్డు పారితోషికం

ఇదిలా ఉంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నేడు తన పుట్టిన 75వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. కర్ణాటకలో 1950 డిసెంబర్ 12న రామోజీ రావు, రామా బాయి దంపతులకు నాలుగో కొడుకుగా శివాజీ రావు(రజనీకాంత్‌ అసలు పేరు) పుట్టారు. బెంగళూరులో చదివిన శివాజీరావు, చదువుపై కాకుండా నటనపై దృష్టి పెట్టారు. చదువు తర్వాత బస్ కండక్టర్‌గా పనిచేస్తూ నాటకాల్లో నటించారు. 1975లో ‘కథా సంగమ’ అనే కన్నడ చిత్రంతో అరంగేట్రం చేశారు. అదే ఏడాది కె.బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’లో చిన్న పాత్ర చేశారు. `మూండ్రు ముడిచ్చు`, `16 వయదినిలే` లాంటి చిత్రాలు రజనీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. విలన్‌గా చేస్తూ హీరోగా మారిన మొదటి సినిమా ‘భైరవి’. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలతో రజినీకాంత్ స్టార్ అయ్యారు. కె.బాలచందర్ సలహాతో తమిళం నేర్చుకుని అగ్ర నటుడిగా ఎదిగారు. ఇప్పుడు తిరుగులేని సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. చివరగా ఆయన `కూలీ` చిత్రంలో నటించి ఆకట్టుకున్నారు. కానీ ఇది బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ప్రస్తుతం ఆయన `జైలర్‌ 2`లో నటిస్తున్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మోహన్‌ లాల్‌, శివ రాజ్‌ కుమార్‌తోపాటు రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నట్టు సమాచారం.

మొత్తం మీద, సౌత్ ఇండియన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్ చరిత్ర సృష్టించారు. ఆయన ముందు ఏ ఇతర స్టార్ హీరోలు నిలబడలేదని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.