|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. టీఎంసీని వీడిన యూసఫ్ పఠాన్

Published: 10-06-2026, 3:47 PM
మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. టీఎంసీని వీడిన యూసఫ్ పఠాన్

తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో అసమ్మతి జ్వాలలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత.. అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నిలువునా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీకి చెందిన 19 మంది లోక్‌సభ సభ్యులు తిరుగుబాటు వర్గంలో చేరినట్లుగా తెలుస్తోంది. సభలో ప్రత్యేక పక్షంగా (Faction) ఏర్పడటానికి కావాల్సిన మూడింట రెండు వంతుల మెజారిటీని ఈ అసమ్మతి వర్గం సాధించినట్లుగా సమాచారం. అయితే, తిరుగుబాటు గ్రూపు సంతకాల జాబితాలో అనూహ్యంగా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, ప్రముఖ నటి సాయోని ఘోష్, మాలా రాయ్, శత్రుఘ్న సిన్హా వంటి కీలక నేతలు ఉండటం సంచలనం రేపుతోంది. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన కాకోలి ఘోష్ దస్తీదార్ ఈ పార్లమెంటరీ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు.

కాగా, తాము భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరడం లేదని కాకోలి ఘోష్ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము ప్రత్యేక పక్షంగా ఉంటూ కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీంతో పార్లమెంట్‌లో అధికార ఎన్డీయే కూటమికి బలం మరింత పెరగనుంది. మరోవైపు, ఈ పరిణామాలపై టీఎంసీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా మండిపడ్డారు. తిరుగుబాటుదారులను ఆమె ద్రోహులుగా అభివర్ణించారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.