|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సోషల్ మీడియా స్టార్ విషాదాంతం: యెమెన్ స్పైడర్ మ్యాన్ మృతి వెనుక అసలు నిజం!

Published: 13-06-2026, 4:46 AM
సోషల్ మీడియా స్టార్ విషాదాంతం: యెమెన్ స్పైడర్ మ్యాన్ మృతి వెనుక అసలు నిజం!
  • అల్ ఖాఖా యెమెన్‌లోని డామ్ట్ ప్రాంతంలో 120 మీటర్ల అగ్నిపర్వత బిలాన్ని ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది.
  • సోషల్ మీడియా వీడియోల కోసం విన్యాసాలు చేస్తుండగా వేడినీటి గుండంలో పడి మరణించాడు.
  • ఎలాంటి పరికరాలు లేకుండా పర్వతాలు ఎక్కి ‘యెమెన్ స్పైడర్ మ్యాన్’ గా పేరు పొందాడు.
  • అల్ ఖాఖా మృతి పట్ల సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

యెమెన్ ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ అల్ ఖాఖా సాహస విన్యాసాలు చేస్తూ విషాదకరంగా మరణించాడు. సోషల్ మీడియా వీడియోల కోసం పర్వతాలు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్తు వేడినీటి గుండంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సాహసాలు చేస్తూ విషాదాంతం

రియ‌ల్ లైఫ్ స్పైడ‌ర్ మ్యాన్ అల్ ఖాఖా విన్యాసాలు చేస్తూనే ప్ర‌మాదవ‌శాత్తు కింద‌ప‌డి మ‌ర‌ణించాడు. యెమెన్ లోని డామ్ట్ ప్రాంతంలో 120 మీటర్ల హరధాత్ దమ్త్ అగ్నిపర్వత బిలాన్ని ఎక్కుతుండ‌గా వేడినీటిలో ప‌డిపోయాడు. సోష‌ల్ మీడియాలో పెట్టేందుకు వీడియోలు షూట్ చేస్తున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గ‌తంలో ఈ ప‌ర్వ‌తాల‌ను అల్ ఖాఖా అవ‌లీల‌గా ఎక్కేసేవాడు. కానీ ఈసారి కొండ‌ల‌పై విన్యాసాలు చేస్తున్న స‌మ‌యంలో అనుకోకుండా కాలు జారింది. ప‌డిపోతున్న స‌మ‌యంలో వేరే చోట ప‌ట్టుకుందామ‌ని ప్ర‌య‌త్నించినా లాభం లేకుండాపోయింది.

నీటి గుండంలో నీరు వేడిగా, ఎక్కువ లోతుగా ఉండ‌టంతో మృత‌దేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది గంట‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే అల్ ఖాకా ఎలాంటి ప‌రిక‌రాలు లేకుండా ఈజీగా ప‌ర్వ‌తాల‌ను ఎక్కుతూ సోష‌ల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈయ‌న‌కు సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌లాది మంది ఫాలోవ‌ర్స్ ఉండ‌టంతో పాటు విదేశాల్లోనూ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అల్ ఖాఖా విన్యాస‌ల‌కు ఫిదా అయిన నెటిజ‌న్లు ఆయ‌న‌ను యెమెన్ స్పైడ‌ర్ మ్యాన్ అని పిలుచుకుంటారు. అలాంటి వ్య‌క్తి మ‌ర‌ణించడంతో సోష‌ల్ మీడియాలో అభిమానులు, ఫాలోవ‌ర్లు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

యెమెన్ స్పైడర్ మ్యాన్ గా గుర్తింపు

సోషల్ మీడియాలో అభిమానుల సంతాపం

ప్రమాదకర విన్యాసాలతో స్టార్‌గా మారిన అల్ ఖాఖా మృతి, సాహసాల పట్ల జాగ్రత్త అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.