
📌 Key Points
- డిటర్జెంట్ తగ్గించి, చివరిగా వెనిగర్ లేదా డెటాల్ వాడండి.
- వాషింగ్ మెషీన్‌లో ఎక్స్‌ట్రా స్పిన్ సైకిల్ రన్ చేసి, బట్టలు గట్టిగా పిండండి.
- తేమ లేని ప్రదేశాల్లో, గాలి తగిలేలా బట్టలు ఆరబెట్టండి.
- గదిలో తేమ తగ్గించడానికి ఏసీ డ్రై మోడ్ లేదా రాతి ఉప్పు వాడండి.
వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడం, వాటి నుంచి వచ్చే దుర్వాసన గృహిణులకు పెద్ద సమస్య. ఎండ లేకపోవడం, తేమ అధికంగా ఉండటం వల్ల బట్టల్లో బ్యాక్టీరియా చేరి చెడు వాసన వస్తుంది. ఈ సమస్యను నివారించడానికి కొన్ని సులభమైన, సమర్థవంతమైన ఇంటి చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డిటర్జెంట్ వాడకంలో జాగ్రత్తలు
వర్షాకాలం ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ గృహిణులకు మాత్రం బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. నిరంతరం కురిసే వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం, ఎండ లేకపోవడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. దీనివల్ల బట్టల నుండి ఒక రకమైన కుళ్లిన వాసన లేదా చెడు వాసన(Musty Smell) వాసన వస్తుంది. అంతేకాదు బట్టల్లో తేమ ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం కూడా ఉంది.
ఈ వర్షాకాలంలో మీ బట్టల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా, ఎల్లప్పుడూ సువాసనభరితంగా ఉండాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.
చాలా మంది ఎక్కువ సర్ఫ్ లేదా లిక్విడ్ వాడితే బట్టలు బాగా క్లీన్ అవుతాయని, వాసన రావని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎక్కువ డిటర్జెంట్ వాడటం వల్ల అది బట్టల పోగులలో పేరుకుపోయి, తేమను బంధించి ఉంచుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా చేరి వాసన మరింత పెరుగుతుంది.
బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ పరిమాణాన్ని తగ్గించండి. బట్టలు పిండే చివరి నిమిషంలో ఒక కప్పు తెల్ల వెనిగర్ లేదా కొద్దిగా డెటాల్ వేయండి. ఇది బట్టల్లోని బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను దూరం చేస్తుంది.
బట్టలు త్వరగా ఆరబెట్టే చిట్కాలు
బట్టలు త్వరగా ఆరాలంటే వాటిలో అస్సలు నీరు ఉండకూడదు. ఒకవేళ మీరు వాషింగ్ మెషీన్ వాడుతుంటే, బట్టలు ఉతికిన తర్వాత మరోసారి ఎక్స్‌ట్రా స్పిన్ సైకిల్ రన్ చేయండి. చేత్తో ఉతికేవారైతే నీరు లేకుండా గట్టిగా పిండేయాలి. దీనివల్ల బట్టల్లోని 90 శాతం నీరు పోయి, అవి ఇంట్లోనే ఫ్యాన్ కిందనైనా త్వరగా ఆరిపోతాయి. వాసన కూడా రాదు. బట్టల్లో నీరు ఎక్కువగా ఉంటే.. అవి ఆరేందుకు టైమ్ పడుతుంది.
వర్షం పడుతున్నప్పుడు బట్టలను ఇంట్లోనే ఆరబెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు వంటగది, బాత్రూమ్ వంటి తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో బట్టలు వేయకండి. కిటికీల పక్కన, గాలి బాగా ఆడే హాల్‌లో లేదా నేరుగా ఫ్యాన్ కింద బట్టలు ఆరబెట్టాలి. బట్టల మధ్య తగినంత గ్యాప్ ఉంచడం వల్ల గాలి తగిలి త్వరగా ఆరుతాయి. చాలా మంది ఒకదానిమీద మరోటి వేస్తారు. దీంతో బట్టలు కంపు వాసన వస్తాయి.
గదిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే బట్టలు అస్సలు ఆరవు. మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉంటే దాన్ని డ్రై మోడ్‌లో ఉంచడం ద్వారా గదిలోని తేమను తగ్గించవచ్చు. ఒకవేళ ఏసీ లేకపోతే, బట్టలు ఆరబెట్టిన స్టాండ్ కింద ఒక గిన్నెలో రాతి ఉప్పు ఉంచండి. ఇది గాలిలోని తేమను పీల్చేసుకుంటుంది. అలాగే బట్టల అల్మారాల్లో సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచడం వల్ల బట్టలు ఎప్పుడూ డ్రైగా ఉంటాయి. వాసన రావు.
బట్టలు 90 శాతం ఆరిన తర్వాత కూడా కొద్దిగా చల్లగా, తేమగా అనిపిస్తే వెంటనే వాటిని ఐరన్ చేయండి. ఇస్త్రీ పెట్టె వేడికి బట్టల్లోని మిగిలిన తేమ పూర్తిగా ఆవిరైపోతుంది. అంతేకాకుండా, తేమ వల్ల బట్టలపై చేరిన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. వాసన కూడా రావు.
గదిలో తేమ నియంత్రణ
కొన్నిసార్లు బట్టల వల్ల కాకుండా మురికిగా ఉన్న వాషింగ్ మెషీన్ డ్రమ్ వల్ల కూడా బట్టలు వాసన వస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి మెషీన్‌ను టబ్ క్లీన్ చేయండి. వాడిన తర్వాత మెషీన్ మూతను కాసేపు తెరిచి ఉంచండి.
వర్షాకాలంలో జీన్స్, లావుపాటి కాటన్ దుస్తులు ఆరడం చాలా కష్టం. కాబట్టి ఈ సీజన్ లో త్వరగా ఆరిపోయే నైలాన్, జార్జెట్, సిల్క్ లేదా లైట్ వెయిట్ దుస్తులను ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
దుర్వాసన ఎక్కువగా ఉన్న బట్టలను ఉతికేటప్పుడు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే ఎలాంటి మొండి వాసనలైనా మాయమవుతాయి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ చిట్కాలను పాటించడం ద్వారా వర్షాకాలంలో బట్టల దుర్వాసన సమస్యను సులభంగా అధిగమించవచ్చు. మీ బట్టలు ఎల్లప్పుడూ తాజాగా, సువాసనభరితంగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ సాధారణ పద్ధతులు మీ దైనందిన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.


