
📌 Key Points
- రేపు చంద్రగ్రహణం, తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించే అవకాశం.
- సింహరాశిలో పుబ్బ నక్షత్రంలో గ్రహణం, ఆ రాశివారికి ప్రతికూల ప్రభావం.
- గ్రహణ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం.
- గర్భిణీ స్త్రీలు, వృద్ధులు గ్రహణానికి ముందు ఆహారం తీసుకోవచ్చు.
రేపు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించనుంది. ఈ గ్రహణం రాశిఫలాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలపై చంద్రగ్రహణం ప్రభావం
మార్చి3న అంటే రేపు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణంగా పిలుస్తున్నారు. అంటే చంద్రుడు గ్రహణంలో ఉదయిస్తాడని అర్థం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటల నుంచి గ్రహణం ప్రారంభమై.. సాయంత్రం 6.47 గంటలకు ముగుస్తుంది. ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో ఈ చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించనుంది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్ర సమయంలో గ్రహణం పాక్షికంగా కనిపించే చాన్స్ ఉంది. భారత్ లో ఈ గ్రహణం కంటికి కనిపించకున్నా.. శాస్త్రం పరంగా పట్టు, విడుపు స్నానాలు ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 3.20 గంటలకే పట్టు స్నానం, సాయంత్రం 6.47 గంటలకు గ్రహణ విడుపు స్నానాలు ఆచరించాలని చెప్తున్నారు.
ఇక ఈ చంద్రగ్రహణం సింహరాశిలో పూర్వఫల్గుణి (పుబ్బ) నక్షత్రంలో ఏర్పడుతోంది. సో.. దీని ఎఫెక్ట్ సింహ, కర్కాటక, మకర, కుంభ రాశులపై ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ రాశులవారు పూర్తి, పాక్షిక గ్రహణాన్ని వీక్షించకూడదని సూచిస్తున్నారు. గ్రహణ ప్రభావమైతే అన్ని రాశులపై ఉంటుందని తెలిపారు. మేషం, మీనం, ధనస్సు, వృశ్చికం, కన్య, కుంభం, కర్కాటకం, మకర రాశులపై ప్రతికూల ప్రభావాలు ఉండే చాన్స్ ఉందని, పురోహితుల్ని సంప్రదించి గ్రహణ శాంతులు చేయించుకోవాలని సూచించారు.
గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు
సనాతన ధర్మాన్ని పాటించేవారు.. చంద్రగ్రహణ సమయంలో కొన్ని నియమ, నిబంధనలు ఆచరించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలలోపే భోజనాన్ని పూర్తి చేయాలని సూచించారు. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారైతే గ్రహణానికి అరగంట ముందు వరకూ ఆహారం తీసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహార పదార్థాలను గ్రహణం తర్వాత తినకూడదని, విడుపు స్నానం చేశాక మళ్లీ వండుకుని తినాలని చెప్తున్నారు. గ్రహణ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణం లేదా గాయత్రీమంత్రజపం లేదా గ్రహణ పీడా పరిహార శ్లోకాలు పఠించాలని సూచించారు. ఇవి అత్యంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయంటున్నారు.
రాశిఫలాలపై గ్రహణ ప్రభావం – నివారణ మార్గాలు
గమనిక : చంద్రగ్రహణంపై ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ఆధ్యాత్మిక నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా అందించాం. దీనిని దిశ యాజమాన్యం ధృవీకరించదు.
రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి సూచించిన నియమాలు పాటించండి. శాస్త్ర ప్రకారం నడుచుకోవడం ద్వారా ప్రతికూల ఫలితాలను నివారించవచ్చు.


