|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏఐ విప్లవం: ఇంటి పనులకే గంటకు రూ.250! గృహిణిల కొత్త ఆదాయ మార్గం!

Published: 13-06-2026, 4:46 AM
ఏఐ విప్లవం: ఇంటి పనులకే గంటకు రూ.250! గృహిణిల కొత్త ఆదాయ మార్గం!
  • చెన్నైలో ఓ గృహిణి హెడ్ మౌంటెడ్ కెమెరాలతో తన రోజువారీ ఇంటి పనులను రికార్డు చేస్తోంది.
  • ఈ వీడియోలను హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చే ఏఐ కంపెనీలకు పంపుతూ గంటకు రూ.250 సంపాదిస్తోంది.
  • రోజుకు 90కి పైగా ఇలాంటి క్లిప్‌లను చిత్రీకరిస్తూ, గిగ్ ఎకానమీలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.
  • ఏఐ ప్రభావంతో ఉద్యోగ మార్కెట్‌లో వస్తున్న మార్పులు, కొత్త ఉపాధి అవకాశాలపై ఈ ఉదంతం చర్చకు దారితీస్తోంది.

ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, గిగ్ ఎకానమీలో సరికొత్త పోకడలు వెలుగు చూస్తున్నాయి. ఇంటి పనులు చేస్తూనే గంటకు రూ.250 సంపాదిస్తున్న ఓ మహిళ ఉదంతం, భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావాన్ని, కార్మిక విధానాలపై ప్రభుత్వాల బాధ్యతను చర్చకు తెస్తోంది. ఇది సామాజిక, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

హెడ్ మౌంటెడ్ కెమెరాలతో గృహిణిల ఆదాయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు మరింత అడ్వాన్స్ గా మారుతోంది. తయారీ రంగంలో సమూల మార్పుల దిశగా ఈ ఏఐ ప్రయాణం కొనసాగుతోంది. ఏఐ రంగంలో వస్తున్న మార్పులతో త్వరలోనే పూర్తి స్థాయి ఆటోమెషన్‍కు దారి తీయబోతోందనే చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఓ వీడియో అందరిని మరోసారి షాక్ కు గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలలో కార్మికుల తలలకు అమర్చిన హెడ్ మౌండెట్ కెమెరాలు తాజాగా గృహిణిల తలపైకి కూడా వచ్చి చేరాయి. సదరు మహిళలు రోజువారి చేసుకునే పనులను హెడ్ మౌండెట్ కెమెరాల ద్వారా రికార్డు చేస్తున్నారు. ఇలా చెన్నైకి చెందిన ఓ 25 ఏళ్ల గృహిణి కేవలం తన రోజువారీ ఇంటి పనులు చేయడం ద్వారా గంటకు రూ.250 సంపాదిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సషళ్ మీడియాలో వైరల్‍గా మారింది.

సదరు మహిళ తన తలపై ఫోన్‌ను అమర్చుకుని.. కాఫీ పెట్టడం, పండ్లు కోయడం, బట్టలు మడతపెట్టడం వంటి పనులను రికార్డ్ చేస్తోంది. నిజ జీవిత పనులను నిర్వహించడానికి హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చే ఏఐ (AI) కంపెనీలకు ఈ ఫస్ట్-పర్సన్ (తమ కోణం నుంచి కనిపించే) వీడియోలను పంపుతారు. ఆమె రోజుకు 90 కి పైగా ఇలాంటి క్లిప్‌లను చిత్రీకరిస్తుంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఎకానమీలో ఆమె కూడా ఒక భాగం అని. భవిష్యత్తు రోబోలకు శిక్షణ ఇవ్వడం కోసం ఇక్కడ వేలాది మంది తమ రోజువారీ జీవితాన్ని ఇలాగే ఫిల్మ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తుండగా ఇంటి పనులు చేసినందుకు గంటకు రూ.250 ఎవరు ఇస్తారంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఏఐ రాకతో సాఫ్ట్ వేర్ రంగాలో భారీగా లే ఆఫ్ లు కొనసాగుతున్న తరుణంలో నిజ జీవితంలో మనుషులు చేసే పనులను రోబోల చేత చేయించేందుకు వాటికి శిక్షణ ఇప్పించడం ఆసక్తిని రేపుతోంది.

ఏఐ రోబోలకు శిక్షణలో మానవ పాత్ర

గిగ్ ఎకానమీలో కొత్త ట్రెండ్, భవిష్యత్తు

ఏఐ, గిగ్ ఎకానమీ కలయికతో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను, జీవనశైలిని గణనీయంగా ప్రభావితం చేయనున్నాయి. సాంకేతిక పురోగతిని అందిపుచ్చుకుంటూనే, సామాజిక న్యాయం, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.