|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిర్యానీ వివాదం: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, కమెడియన్ క్షమాపణ, ఖాతా డీయాక్టివేట్!

Published: 13-06-2026, 4:46 AM
బిర్యానీ వివాదం: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు, కమెడియన్ క్షమాపణ, ఖాతా డీయాక్టివేట్!
  • స్టాండప్ కమెడియన్ ప్రణిత్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
  • నెటిజన్ల ఆగ్రహం, సెలబ్రిటీల విమర్శలతో ప్రణిత్ క్షమాపణలు చెప్పి, వీడియోను తొలగించారు.
  • వివాదం ముదరడంతో ప్రణిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు.
  • జాతీయ మహిళా కమిషన్ నోటీసులు, మహారాష్ట్ర సైబర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాటిని సమర్థించిన తీరు తీవ్ర దుమారం రేపింది. ‘బిర్యానీ కొనిస్తే అమ్మాయిని అనుభవించొచ్చు’ అనే వ్యాఖ్యలపై నెటిజన్లు, సెలబ్రిటీలు మండిపడ్డారు. ఈ వివాదం జాతీయ మహిళా కమిషన్, పోలీసుల జోక్యం వరకు దారితీసింది.

బిర్యానీ వివాదం: అసలేం జరిగింది?

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన తీవ్ర విమర్శలు, నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ ప్రణిత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తన కామెడీ షోకు సంబంధించిన ‘రూ.370 బిర్యానీ’ వీడియో క్లిప్ తీవ్ర వివాదాస్పదంగా మారడంతో, ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పిన కొద్దిసేపటికే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ప్రణిత్ నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోలో ప్రేక్షకుడిగా వచ్చిన ఓ యువకుడు మహిళలను కించపరిచేలా మాట్లాడాడు. తాను ఒక అమ్మాయితో డేట్‌కు వెళ్లినప్పుడు రూ.370 ఖర్చు పెట్టి చికెన్ బిర్యానీ ఇప్పించానని, అయితే డేట్ ముగిసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోవాలని అనుకోవడంతో తనకు నష్టం వచ్చినట్లు అనిపించిందని అన్నాడు. పెట్టిన డబ్బును వసూలు చేసుకోవడానికి (శారీరక సాన్నిహిత్యం ద్వారా) ప్రయత్నించానంటూ సదరు యువకుడు అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వేదికపై ఉన్న కమెడియన్ ప్రణిత్ ఆ వ్యాఖ్యలను అడ్డుకోకపోగా, గట్టిగా నవ్వుతూ సమర్థించారు. అంతేకాకుండా ఆ షోలో కథ బాగా చెప్పావంటూ ఆ యువకుడికి రూ.5000 బహుమతి కూడా ఇచ్చారు. అనంతరం ఈ వీడియో క్లిప్‌ను ప్రణిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వివాదం వ్యాపించింది.

మహిళల అంగీకారంతో సంబంధం లేకుండా, వారిపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు అందరూ మండిపడ్డారు. విమర్శలు ముదరడంతో ప్రణిత్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. “వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ వ్యాఖ్యలను చూసి నవ్వి ఊరుకోవడం కంటే, నేను వాటిని అక్కడికక్కడే ఖండించి ఉండాల్సింది. నా వైపు నుంచి పొరపాటు జరిగిన జరిగింది. అందుకే ఈ వీడియోను తొలగించాను” అని పేర్కొన్నారు. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో సదరు వ్యాఖ్యలు చేసిన యువకుడిని అతని కంపెనీ ఉద్యోగం నుండి తక్షణమే తొలగించింది. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచారం చేసినందుకు గానూ మహారాష్ట్ర సైబర్ పోలీసులు ప్రణిత్‌తో పాటు పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల అనంతరం ప్రణిత్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను డియాక్టివేట్ చేయగా.. తప్పు చేసి బాధ్యత నుండి పారిపోవడమేనంటూ నెటిజన్లు మళ్లీ విమర్శలు గుప్పిస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహం, కమెడియన్ క్షమాపణ

జాతీయ మహిళా కమిషన్, పోలీసుల చర్యలు

ఈ వివాదం సోషల్ మీడియా ప్రభావం, బాధ్యతారాహిత్య వ్యాఖ్యల పర్యవసానాలను స్పష్టం చేసింది. సెలబ్రిటీలు తమ మాటల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని, మహిళల పట్ల గౌరవం ప్రదర్శించాలని ఈ ఘటన ఒక హెచ్చరికగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.