
📌 Key Points
- త్రిష కృష్ణన్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన జారా బట్టల నాణ్యత, దుర్వాసనపై మండిపడింది.
- ఒకటి కాదు, మూడుసార్లు ఇలా జరగడంతో జారా బ్రాండ్‌ను నిలదీస్తూ పోస్ట్ చేసింది.
- 40 ఏళ్ల వయసులోనూ బోల్డ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్న త్రిషను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
- దళపతి విజయ్ స్థానంలో త్రిష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్‌లో చర్చ.
త్రిష కృష్ణన్ పేరు గత కొన్ని రోజులుగా మీడియాలో మార్మోగుతోంది. దళపతి విజయ్‌తో ప్రేమాయణం వార్తలు ఒకవైపు, అంతర్జాతీయ బ్రాండ్ జారాపై ఆమె చేసిన తీవ్ర విమర్శలు మరోవైపు ఆమెను వార్తల్లో నిలుపుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బట్టల నాణ్యత సరిగా లేకపోవడం, దుర్వాసన రావడంతో త్రిష ఆగ్రహం వ్యక్తం చేసింది.
జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం ఎందుకు?
Trisha Zara :త్రిష కృష్ణన్.. గత కొన్ని రోజులుగా ఈ పేరు చేస్తున్న రీ సౌండ్ మాములుగా లేదు. ముఖ్యంగా దళపతి విజయ్ సీయం సీట్ ఎక్కడంతో ఈ ముద్దుగుమ్మ వార్తల్లో తెగ హైలెట్ అవుతుంది.కారణం విజయ్ తో త్రిష ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు మీడియాలో తెగ సర్క్యులేట్ కావడమే. దీనికి తోడు ఆ రూమర్స్ కి బలం చేకూర్చేలా వారిద్దరూ కలిసి అడపా దడపా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కూడా.
‘జారా’ (Zara) పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడమే
ఇదిలా ఉంటె తాజగా మరోసారి మీడియాలో హైలెట్ అయింది ఈ వెటరన్ బ్యూటీ.కారణం .. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ ‘జారా’ (Zara) పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వడమే.విషయంలోకి వెళ్తే ఆన్‌లైన్‌లో త్రిష ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన బట్టలు క్వాలిటీ సరిగ్గా లేకపోవడమే కాకుండా ,ముక్కు పుటాలు అదరగొట్టేలా బ్యాడ్ స్మెల్ తో వచ్చాయట.అయితే అలా ఒకటి రెండు కాదు ,,ముచ్చటగా మూడు సార్లు అలానే రావడంతో మండిపడింది ఈ బ్యూటీ.పేరుకేమో ఇంటర్ నేషనల్ బ్రాండ్.కానీ డెలివర్ చేసేవేమో ఇలాంటి బట్టలా, అసలు డెలివర్ చేసేముందు ఒక్కసారైనా వాటిని చెక్ చేసుకోరా అంటూ ఒక రేంజ్ లో కడిగిపారేసింది.
నెట్టింట వైరల్ అవుతున్న త్రిష పోస్ట్!
ఆకాశానికి ఎత్తేస్తున్న నెటిజన్లు
ఇపుడు త్రిష చేసిన ఈ పోస్టే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ పోస్ట్‌తో పాటు పెరిమెనోపాజ్ దశలో మహిళల మానసిక స్థితి, ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఉండే వారిపై ఒక డాక్టర్ చేసిన కామెంట్స్ ని “Fact” అంటూ షేర్ చేయడం మరింత చర్చకు దారితీస్తుంది.మరో వైపు 40 ఏళ్ల వయసులోనూ ఇలా బోల్డ్ గా డిసీషన్స్ తీసుకోవడం, వెనుకడుగు వేయకుండా క్వశ్చన్ చేయడం మెచ్చుకోతగ విషయం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.
రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?
పాలిటిక్స్ లోనూ తనదైన ముద్ర వేస్తుందో లేదో !
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే తాజాగా కరుప్పుతో సాలి హిట్ జోట్టిన ఈ తమిళ పొన్ను విశ్వంభరలోనూ కీ రోల్ చేసిన సంగతి తెల్సిందే. మరో వైపు విజయ్ వదిలేసే తిరుచ్చి నియోజకవర్గం mla అభ్యర్థిగా త్రిష నిలబడబోతుంది అంటూ కోడై కూస్తుంది కోలీవుడ్ . అయితే మొదటగా రాఘవ లారెన్స్ పేరు గట్టిగా వినిపించినప్పటికీ తను నేను ఇప్పుడే పాలిటిక్స్ లోకి రాలేను అని చెప్పడంతో త్రిష పేరు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది.చూడాలి మరి సినిమలాతో సత్తా చాటిన ఈ అమ్మడు పాలిటిక్స్ లోనూ తనదైన ముద్ర వేస్తుందో లేదో !
జారా బ్రాండ్‌పై త్రిష చేసిన ఈ బోల్డ్ వ్యాఖ్యలు, ఆమె రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలు ఆమెను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. 40 ఏళ్ల వయసులోనూ ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.



Amitabh Bachchan Admits Mistake After Racism Row Over France Football Team Tweet