
📌 Key Points
- ప్రీతి జింటా ఫోటోలు, వీడియోలను డీప్ఫేక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
- బాంబే హైకోర్టు గూగుల్, మెటాలను నకిలీ కంటెంట్ తొలగించాలని ఆదేశించింది.
- వ్యక్తిత్వ హక్కులు ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయని కోర్టు తీర్పు.
- కత్రినా కైఫ్, రష్మిక మందన్న వంటి తారలు కూడా డీప్ఫేక్ బాధితులే.
డీప్ఫేక్ మాయాజాలంతో బాధపడుతున్న తారలకు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. ప్రీతి జింటా కేసులో గూగుల్, మెటాలను నకిలీ కంటెంట్ తొలగించాలని ఆదేశించింది. వ్యక్తిత్వ హక్కులు ప్రాథమిక హక్కులని స్పష్టం చేసింది.
ప్రీతి జింటా డీప్ఫేక్ కేసు నేపథ్యం
Deepfake Content: ”కాదెవరూ డీప్ ఫేక్ కి అనర్హం” అన్నట్టుగా బాలీవుడ్ తారల నుండి కోలీవుడ్ భామల వరకు అంతా దీని బాధితులే. అసలు వాటిల్లో ఉన్నది తామేనా అన్నంత బ్రమపడేలా డీప్ ఫేక్ మాయాజాలంతో బూతు బొమ్మలని మార్ఫింగ్ చేస్తూ తారల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు. అయితే తాజాగా ఇదే ‘డీప్‌ఫేక్’ మాయాజాలంపై మరోసారి కొరడా జులిపించింది బాంబే హైకోర్టు.
బాంబే హైకోర్టు మెట్లెక్కిన ప్రీతి జింటా
నాకు తెలీకుండా నా ఫోటోని , గొంతుని మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా బూతు బొమ్మల్ని వదిలారని, దయచేసి వాటిని తొలగించేలా ఆర్డర్ ఇవ్వాలంటూ గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా వారిని ప్రతివాదులుగా చేరుస్తూ గత కొన్ని రోజుల కిందట సొట్టబుగ్గల బ్యూటీ ప్రీతి జింటా బాంబే హైకోర్టు మెట్లెక్కిన సంగతి తెల్సిందే.ఇక ఇదే కేసులో కోర్ట్ తీర్పునిస్తూ నకిలీ ఫోటోలు, అశ్లీల వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలంటూ గూగుల్, మెటా వంటి సోషల్ మీడియా దిగ్గజాలను కోర్టు ఆదేశించింది.అంతేకాదు..టెక్నాలజీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీల రెస్పెక్ట్ ని కాపడలేకపోతే అది మన సొసైటీకే డేంజర్ అంటూ హెచ్చరించింది.
కోర్టు ఆదేశాలు: తక్షణమే తొలగించాలి
విచ్చలవిడిగా పెరిగిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఇక ఇదే తీర్పులో తారల పర్సనాలిటీ రైట్స్ (వ్యక్తిత్వ హక్కులు), పబ్లిసిటీ రైట్స్ అనేవి కేవలం బిజినెస్ పరంగా చేసే ప్రకటనలకే పరిమితం కాదని, అవి ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా గౌరవంగా జీవించే ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తాయని కుండబద్దలు కొట్టింది కోర్ట్.ప్రీతి జింటా ఒక్కరే కాదు గతంలో కత్రినా కైఫ్,రష్మిక మందన్న,ఆలియా భట్ వంటి తారలు చాలా మంది ఈ డీప్‌ఫేక్ బాధితులే. విచ్చలవిడిగా పెరిగిపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తారల బూతు చిత్రాలని, వీడియోలని కొంతమంది అదే పనిగా చానెల్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం తెలిసిందే.
వ్యక్తిత్వ హక్కులు ప్రాథమిక హక్కులే
ఇక ప్రీతి జింటా విషయానికి వస్తే “దిల్ సే” సినిమాతో బాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సొట్టబుగ్గల భామ”కల్ హో నా హో”, “వీర్-జారా” వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ తో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నసంగతి తెల్సిందే.ఇక IPL పంజాబ్ కింగ్స్ సహ-యజమానిగా స్టేడియంలో ఎలాంటి రచ్చ చేస్తుందో చెప్పక్కర్లేదు.చూడాలి మరి ఇలాంటి పనికి మాలిన పనులకి అడ్డు కట్ట వేయాల్సిందే అంటూ కోర్టు తీర్పునిచ్చిన ఈ సమయంలో గూగుల్, మరియూ ఇతర ఫ్లాట్ ఫామ్స్ ఏమేరకి అడ్డుకుంటాయో !
ఈ తీర్పు డీప్ఫేక్ బాధితులందరికీ ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. వ్యక్తిత్వ హక్కులను కాపాడటంలో ఇది ఒక మైలురాయి. సెలబ్రిటీల గౌరవాన్ని కాపాడటానికి ఇలాంటి చర్యలు అవసరం.


