|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి మెగా 158 షూటింగ్: 12 గంటల నాన్ స్టాప్ యాక్షన్, నడవలేని స్థితిలో సెట్ నుంచి బయటకు!

Published: 09-07-2026, 12:14 PM
చిరంజీవి మెగా 158 షూటింగ్: 12 గంటల నాన్ స్టాప్ యాక్షన్, నడవలేని స్థితిలో సెట్ నుంచి బయటకు!
  • చిరంజీవి మెగా 158 కోసం 12 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్ చేశారు.
  • వర్షంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించి నడవలేని స్థితికి చేరుకున్నారు.
  • డైరెక్టర్ బాబీ కొల్లి భుజాలపై చేతులు వేసి ఆయనను సపోర్ట్ చేశారు.
  • 70 ఏళ్ల వయసులోనూ ప్రేక్షకుల కోసం ప్రాణాలను లెక్క చేయడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి తన నిబద్ధతతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెగా 158 సినిమా కోసం 12 గంటల పాటు వర్షంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించి, నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆయన కష్టాన్ని చూసి చిత్ర బృందం షాక్ అయ్యింది.

మెగా 158 షూటింగ్ లో చిరంజీవి నిబద్ధత

Mega 158:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి , నటన సామర్థ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడుపదుల వయసులో కూడా ప్రేక్షకులను అలరించడానికి ప్రాణాలను కూడా లెక్క చేయని వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో మెగా 158 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బెంగాల్ మాఫియా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమా షూటింగ్ ను కూడా శరవేగంగా జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిబద్ధతకు అద్దంపడుతూ తీసిన ఒక సన్నివేశం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సెలబ్రిటీలు ప్రేక్షకులను మెప్పించడానికి ఎంత కష్టాన్నైనా భరిస్తారు అనేది ఇప్పుడు కొంతమంది నటీనటులను చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ప్రథమ స్థానంలో నిలుస్తారు. తాజాగా మెగా 158 సినిమా కోసం వర్షంలో తీసే సీక్వెన్స్ కోసం చిరంజీవి ఏకంగా 12 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాదులో వేసిన ఒక భారీ సెట్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.” ఉదయం 4 గంటలకు వ్యాయామంతో తన రోజున ప్రారంభించే చిరంజీవి నిబద్ధతను చూసి మా చిత్ర బృందం మొత్తం ఆశ్చర్యపోయింది.అంత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయడం కోసం సుమారుగా 12 గంటల సమయం పట్టింది. వర్షంలో ఉండే ఈ సన్నివేశాన్ని చిరంజీవి ఎంతో కష్టపడి పూర్తి చేశారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు” అంటూ చిత్ర బృందం ఒక ఫోటోని పంచుకోవడంతో పాటు ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసింది.

12 గంటల నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్స్

ఇకపోతే తాజాగా మూవీ యూనిట్ షేర్ చేసిన ఫోటోలో డైరెక్టర్ భుజాలపై మెగాస్టార్ చిరంజీవి చేతులు వేసి కాస్త నడవలేని స్థితిలో సినిమా గురించి చర్చిస్తున్నట్లు ఉంది అంటూ నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా 70 సంవత్సరాల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకులను మెప్పించడానికి పడుతున్న కష్టం వర్ణనాతీతం అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నడవలేని స్థితిలో సెట్ నుంచి బయటకు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158 సినిమా విషయానికి వస్తే.. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ నటిస్తుండగా.. ప్రముఖ కన్నడ నటి రచితా రామ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ గా విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్ గా ఆంటోనీ ఎల్ రూబెన్ పనిచేస్తున్నారు.

Tags Chiranjeevi Bobby Movie Update Mega 158 Movie Share

చిరంజీవి వయసు 70 దాటినా ప్రేక్షకులను మెప్పించడానికి పడుతున్న కష్టం వర్ణనాతీతం. ఆయన నిబద్ధత అభిమానులకు స్ఫూర్తిదాయకం. మెగా 158 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.