|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ అప్డేట్: నాని ‘ది ప్యారడైజ్’ మూడోసారి వాయిదా!

Published: 14-07-2026, 11:40 AM
  • నాని ‘ది ప్యారడైజ్’ మూడోసారి వాయిదా పడినట్లు సమాచారం.
  • ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 24కు మారినట్లు వార్తలు.
  • షూటింగ్ 30 రోజులు పెండింగ్, ప్రచార సమయం లేకపోవడం కారణం.
  • చిత్రంలో నాని సరసన కాయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది.

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా మూడోసారి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. షూటింగ్ పూర్తి కాకపోవడం, ప్రచార సమయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడోసారి వాయిదా ఎందుకు?

The Paradise:సాధారణంగా పెద్ద పెద్ద హీరోలు తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత అదే రోజున విడుదలవుతుందా అంటే చెప్పడం కష్టం. ముఖ్యంగా ప్రేక్షకుడికి విజువల్ వండర్లా సినిమాను అందించడానికి నిత్యం చిత్ర బృందం కష్టపడుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే పలు కారణాలవల్ల సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే నాని ది ప్యారడైజ్ సినిమా కూడా ముచ్చటగా మూడోసారి వాయిదా పడడంతో అభిమానులు మళ్లీ నిరాశలోకి వెళ్లిపోయారు. ఈసారి వాయిదా పడడానికి అసలు కారణం ఏంటి ? మళ్లీ కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు? అనే విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మళ్లీ నాని ది ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. నిజానికి దసరా బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. ఈ చిత్రాన్ని 1940 – 1970 బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక పవర్ఫుల్ వండర్ వరల్డ్ మాఫియా స్టోరీ గా దీనిని రూపొందిస్తున్నారు. నిజానికి మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఆగస్టు కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావలసిన ది ప్యారడైజ్ సినిమా ఆ రోజున విడుదల కావడం లేదని.. సెప్టెంబర్ 24 కి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త విడుదల తేదీ ఎప్పుడు?

ఇకపోతే ఈ సినిమా మళ్లీ వాయిదా పడడానికి కారణం సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతోనే వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 రోజులు పెండింగ్లో ఉండడం, తగినంత ప్రచార సమయం లేకపోవడం వల్లే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇకపోతే ది ప్యారడైజ్ చిత్రంలో నాని సరసన కాయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు, సోనాలి కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార వీడియోలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కూడా నిలిచాయి. మరి భారీ అంచనాల మధ్య రాబోయే ఈ సినిమా నాని కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలబడుతుందేమో చూడాలి.

చిత్రంలో నటీనటులు ఎవరెవరు?

మరి ఈసారి సెప్టెంబర్ 24న సినిమా విడుదల అవుతుందా లేదా? అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిర్మాతలు త్వరలోనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.