
📌 Key Points
- ప్రముఖ నిర్మాత, రోజా ఆర్ట్స్ అధినేత అర్జున రాజు కన్నుమూశారు.
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అర్జున రాజు తుదిశ్వాస విడిచారు.
- ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం, వేటగాడు చిత్రాలను నిర్మించారు.
- అర్జున రాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, రోజా ఆర్ట్స్ అధినేత అర్జున రాజు గారు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
అర్జున రాజు మృతి – టాలీవుడ్‌లో విషాదం
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు శుభకార్యాలు.. మరొకవైపు అశుభవార్తలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవైపు టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరు వైవాహిక బంధంలోకి అడుగుపెడుతూ అభిమానులను సంతోషపరుస్తుంటే.. మరొకవైపు కొంతమంది సినీ తారలు తుదిశ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి , ప్రముఖ నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని , రోజా ఆర్ట్స్ అధినేతల్లో ఒకరైన అర్జున రాజు అనారోగ్యంతో కన్నుమూశారు.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమా పరిశ్రమకు విశేష సేవలు అందించిన అర్జున రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు , సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ అటు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఈయన అంత్యక్రియలు మార్చి 14 2026న హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మహాప్రస్థానంలో నిర్వహించాలని కుటుంబ సభ్యులు తెలిపారు.
రోజా ఆర్ట్స్ అధినేతగా అర్జున రాజు సేవలు
ఎం. అర్జున రాజు ప్రముఖ నిర్మాణ సంస్థ రోజా ఆర్ట్స్ ద్వారా అనేక చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా నిర్మాత శివరామరాజుతో కలిసి ఆయన నటించిన కొండవీటి సింహం, ఎన్టీఆర్ వేటగాడు చిత్రాలు అప్పట్లో మంచి విజయాలను అందించాయి ముఖ్యంగా ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.. రోజా ఆర్ట్స్ తో పాటు రోజా ఆర్ట్ ప్రొడక్షన్స్, రోజా ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై కూడా పలు చిత్రాలను నిర్మించి నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. సినిమా నిర్మాణంలో నిబద్ధత, ప్రొఫెషనల్ ధోరణితో పని చేసే నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఇక అలాంటి ఈయన నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.
సినీ ప్రముఖుల సంతాపం
అర్జున రాజు మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కోరుకుంటూ కుటుంబ సభ్యులకు భగవంతుడు తగిన మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించింది. అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కూడా ఎం.అర్జున రాజు మరణంపై విచారం వ్యక్తం చేశాయి. ఇక అర్జున రాజు నిర్మించిన చిత్రాలను గుర్తు చేసుకుంటూ ఆయనను నిబద్దతతో పనిచేసే నిర్మాతగా ప్రశంసలు కురిపించాయి. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.
అర్జున రాజు గారి మృతి టాలీవుడ్‌కు తీరని లోటు. ఆయన నిర్మించిన ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.


