|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సీఎం రేవంత్ గురించి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సంచలన ట్వీట్.. వైరల్ అవుతున్న పోస్ట్

Published: 15-06-2025, 12:48 PM
సీఎం రేవంత్ గురించి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సంచలన ట్వీట్.. వైరల్ అవుతున్న పోస్ట్

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా సిప్లిగంజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆయన ఎమోషనల్‌గా స్పందించారు.

Key Points

1

రాహుల్ సిప్లిగంజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్కరించారు.

2

సిప్లిగంజ్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

4

కొందరు అభినందించగా, మరికొందరు విమర్శించారు.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్కారం

Liదిశ, ఫీచర్స్ : తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ నటీనటులు, సినిమాలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరినీ సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. కార్యక్రమానికి తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరుకాగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముఖ్యంగా హైదరాబాద్ గల్లీ నుంచి వచ్చి ఆస్కార్ అవార్డు అందుకున్న తెలంగాణ పిల్లోడు రాహుల్ సిప్లిగంజ్‌ను సత్కరించాలని స్వయంగా సీఎం ప్రభుత్వాన్ని కోరడం ప్రత్యేకమే. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

ఇక దీనిపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపాడు. గల్లీలో పెరిగిన ఒక ఆర్టిస్టును గుర్తించి, గౌరవిస్తున్న సీఎం నిజంగా గొప్ప వ్యక్తి అని.. అంత ప్రెస్టీజియస్ స్టేజీ మీద తన గురించి మాట్లాడటంతో ఎమోషనల్ అయిపోయాయని ట్వీట్ చేశాడు. ఇది మరిచిపోలేని జ్ఞాపకమన్న సింగర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెస్పాన్స్ మరింత సంతోషాన్నిచ్చిందని రాసుకొచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. కొందరు కంగ్రాట్స్ చెప్తుంటే ఇంకొందరు మాత్రం నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్

వైరల్ పోస్ట్‌పై స్పందనలు

రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చర్యపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.