|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Cm Revanth Reddy: సినిమా కార్మికులని కూడా పిలిచి మాట్లాడుతా

Published: 24-08-2025, 12:15 PM
Cm Revanth Reddy: సినిమా కార్మికులని కూడా పిలిచి మాట్లాడుతా

టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం జరిగింది. సినిమా కార్మికుల సమస్యలు, పరిశ్రమ అభివృద్ధిపై చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి కార్మికులతోనూ మాట్లాడతానని తెలిపారు.

Key Points

1

సినిమా కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

2

నిర్మాతలు, కార్మికులతో సీఎం చర్చలు

4

కొత్తవారికి నైపుణ్యాల అభివృద్ధికి ప్రణాళికలు

నిర్మాతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కొన్నిరోజుల ముందు వరకు వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికులు-టాలీవుడ్ నిర్మాతల మధ్య సస్పెన్స్ నడిచింది. రీసెంట్‪‌గానే అది కొలిక్కి వచ్చింది. ఎప్పటిలానే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు-దర్శకులు ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ గురించి, సినీ కార్మికుల గురించి మాట్లాడారు.

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి తదితరులు ఉన్నారు. వీళ్లతో రేవంత్ రెడ్డి పలు విషయాలు చర్చించారు.

సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చలు

‘సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుంది.  పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమ  అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఓ పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను, నిర్మాతలను మా ప్రభుత్వం కాపాడుకుంటుంది’

‘సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు.  పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటా. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. తెలుగు చిత్రాల షూటింగ్ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమని ఉంచడమే నా ధ్యేయం’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ హామీ

టాలీవుడ్ పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ భేటీ టాలీవుడ్‌కు ధైర్యాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.