
📌 Key Points
- కాక్రోచ్: రియలిస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 6న విడుదల కానుంది!
- అవార్డు విన్నింగ్ డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా!
- ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
- శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాణంలో సినిమా!
పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘కాక్రోచ్’ సినిమా ఒక రియలిస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీ. వైజాగ్ నేరస్థుల జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను షాక్ కి గురిచేయడానికి సిద్ధంగా ఉంది. సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూడండి.
వయలెంట్ లవ్ స్టోరీగా ‘కాక్రోచ్’!
Cockroach : సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస.. లాంటి పలు సినిమాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాక్రోచ్. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.(Cockroach)
తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించి కాక్రోచ్ సినిమా మార్చి 6న థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
రియల్ లొకేషన్స్ లో రిస్కీ షూటింగ్!
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ తో మంచి సినిమాలు తీసాము. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను రియల్ లొకేషన్స్ లో రిస్కీ షూటింగ్ చేశాము. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది అని తెలిపారు.
మార్చి 6న థియేటర్లలో విడుదల!
దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు తెలియజేయాలి అలాంటి సినిమాలే తీస్తున్నాను. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ తో అనేక కేసులను స్ట చేసి, వైజాగ్ లో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించాను. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు విచిత్రంగా అనిపించాయి. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని చూపించే సినిమా ఇది. ఈ సినిమాని డార్క్ గా, ఓపెన్ గా, బోల్డ్ గా తీసాం. చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండండి అని అన్నారు.
కాక్రోచ్ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఈ చిత్రం వైజాగ్ నేరస్థుల జీవితాల ఆధారంగా తెరకెక్కింది. ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


