|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాలేజీ క్యాంపస్‌ డ్రామాకి సై

Published: 14-08-2025, 6:50 PM
కాలేజీ క్యాంపస్‌ డ్రామాకి సై

నటిగా ఎన్నో విజయాలు సాధించిన ఆలియా భట్, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. తాజాగా ఆమె కొత్త కాలేజీ క్యాంపస్ డ్రామా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఆమె నటించకపోవడం విశేషం.

Key Points

1

ఆలియా భట్ నిర్మాణంలో కొత్త కాలేజీ క్యాంపస్ డ్రామా.

2

ఈ సినిమాలో ఆలియా నటించే అవకాశం లేదు.

4

అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఆలియా భట్ కొత్త ప్రాజెక్ట్

నటిగా సూపర్‌ హిట్‌ అయిన ఆలియా భట్‌ నిర్మాతగా మాత్రం ఇంకా హిట్‌ స్టేటస్‌ను సాధించలేక పోతున్నారు. ఎటర్‌నల్‌ సన్‌షైన్‌ పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థనుప్రారంభించిన ఆలియా భట్, ‘డార్లింగ్‌’, జిగ్రీస్‌’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆలియా భట్‌ లీడ్‌ రోల్‌ చేశారు. కానీ ఈ రెండు చిత్రాలూ హిట్‌ కాలేక పోయాయి. ఇప్పుడు ఆలియా భట్‌ మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్‌ సమాచారం.

కాలేజీ క్యాంపస్ నేపథ్యం

అయాన్‌ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేసిన శ్రీతీ ముఖర్జీ ఓ కాలేజీ క్యాంపస్‌ డ్రామా కథను సిద్ధం చేసి, ఈ కథను ఆలియా భట్‌కు వినిపించారట. ఆలియాకు ఈ కథ నచ్చడంతో నిర్మించేందుకు ఓకే అన్నారట. అయితే కాలేజ్‌ క్యాంపస్‌ డ్రామా కాబట్టి తాను నటించకుండా, నూతన నటీనటులకు చాన్స్‌ ఇవ్వాలని ఆలియా భావిస్తున్నారని, ఆ దిశగా ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.

నూతన నటులకు అవకాశం

ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని బాలీవుడ్‌ టాక్‌. మరోవైపు నటిగా ఆలియా భట్‌ ‘లవ్‌ అండ్‌ వార్‌’ సినిమాలో నటిసస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా, విక్కీ కౌశల్‌ మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.  సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లోని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌ కానుంది.

చివరగా, ఆలియా భట్ నిర్మాణంలో వచ్చే కాలేజీ డ్రామా సినిమా బాలీవుడ్‌లో కొత్త తరం నటీనటులకు మంచి వేదికగా నిలుస్తుందని ఆశిద్దాం. ‘లవ్ అండ్ వార్’ సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.