|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాంబినేషన్‌ సెట్‌?

Published: 16-10-2025, 7:43 PM
కాంబినేషన్‌ సెట్‌?

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌ల కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతుందనే వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, విక్రమ్ తన తదుపరి చిత్రానికి విజయ్‌తో చేయడానికి కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం.

Key Points

1

విజయ్ దేవరకొండ – విక్రమ్ కె. కుమార్ కాంబోలో సినిమా వార్తలు.

2

విజయ్ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాలతో బిజీ.

4

విక్రమ్ కె. కుమార్ విజయ్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట.

విజయ్ దేవరకొండ ప్రస్తుత ప్రాజెక్ట్‌లు

హీరో విజయ్‌ దేవరకొండ–డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. తనకు ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్‌ మూవీ అందించిన దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌తో రెండో సినిమా చేస్తున్నారు విజయ్‌. మరోవైపు ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ రెండు చిత్రాల తర్వాత డైరెక్టర్‌ విక్రమ్‌ కె. కుమార్‌తో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయనున్నారని టాక్‌. ‘ఇష్క్, మనం, హలో, నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు విక్రమ్‌ కె. కుమార్‌. ఇక ఆ మధ్యలో నితిన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రకటన లేదు. అయితే తన తాజా చిత్రాన్ని విజయ్‌తో చేయనున్నారట విక్రమ్‌. ఇందుకోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారట. మరి… ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా? వేచి చూడాల్సిందే.

విక్రమ్ కె. కుమార్‌ నేపథ్యం

కొత్త కాంబినేషన్‌పై ఆసక్తి

మరి ఈ ఆసక్తికర కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా, లేక కేవలం ఊహాగానాలకే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాలి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.