|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా.. 8.5 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Published: 26-06-2025, 3:42 AM
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా.. 8.5 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

8.5 IMDb రేటింగ్‌తో ప్రేక్షకులను మెప్పించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా ‘ది వర్డిక్ట్’ ఇవాళ ఓటీటీలో విడుదలైంది. వరలక్ష్మీ శరత్‌కుమార్, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు.

Key Points

1

8.5 IMDb రేటింగ్‌తో ది వర్డిక్ట్ సినిమా ఓటీటీలోకి!

2

వరలక్ష్మీ శరత్‌కుమార్, సుహాసిని, శ్రుతి హరిహరన్ ప్రధాన పాత్రధారులు.

4

Sun NXT లో తమిళంలో స్ట్రీమింగ్; ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో.

ది వర్డిక్ట్: కథాంశం ఏమిటి?

ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వారంలో సుమారు 20 నుంచి 30 వరకు ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతుంటే అవన్నీ రోజుకు కొన్ని డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఇవాళ ఓటీటీ లోకి ఓ న్యూ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఆ సినిమానే ది వర్డిక్ట్. అంటే తీర్పు అని అర్థం వస్తుంది. తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది ది వర్డిక్ట్. ఇందులో మిస్టరీ, రివేంజ్, లవ్ స్టోరీ వంటి అంశాలు కూడా ఉన్నాయి. ది వర్డిక్ట్ సినిమాకు క్రిష్ణ శంకర్ కథ, దర్శకత్వం రెండు వహించారు. అలాగే, ప్రకాష్ మోహన్ దాస్ ది వర్డిక్ట్ మూవీకి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు.

ఆదిత్య రావు సంగీతం అందించిన ఈ సినిమాకు అగ్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ది వర్డిక్ట్ సినిమాలో హనుమాన్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ వరలక్ష్మీ శరత్ కుమార్ , సీనియర్ హీరోయిన్ సుహాసిని , యంగ్ బ్యూటి శ్రుతి హరిహరన్ ప్రధాన పాత్రలు పోషించారు.

నటీనటులు & సాంకేతిక నిపుణులు

ఈ ముగ్గురితోపాటు ది వర్డిక్ట్ సినిమాలో నిర్మాత అయిన ప్రకాష్ మోహన్ దాస్ మరో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ సినిమాలో తెలుగు లేడి కమెడియన్, నటి విద్యుల్లేఖ రామన్ కూడా నటించారు. ఇక మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. కోర్ట్ రూమ్ డ్రామా, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ది వర్డిక్ట్ సినిమాపై రివ్యూ లు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి ది వర్డిక్ట్ సినిమా పదికి ఏకంగా 8.5 రేటింగ్ సాధించుకుంది. మరి ఇలాంటి ది వర్డిక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవాళ (జూన్ 26) వచ్చేసింది. సన్ నెక్ట్స్ (Sun NXT OTT)లో నేడు ది వర్డిక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది.

ఎక్కడ చూడాలి?

అయితే, కేవలం తమిళ భాషలో మాత్రమే ది వర్డిక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ది వర్డిక్ట్‌ను ఓటీటీలో ఎంచక్కా వీక్షించేయొచ్చు.

ఇక ది వర్డిక్ట్ కథలోకి వెళితే.. ఒక బిలినియర్ అమెరికన్ మహిళ అనుమానాస్పదంగా చనిపోయి ఉంటుంది. ఆమెను భారతీయ మహిళ మర్డర్ చేసినట్లు ఆరోపణలు వస్తాయి. దాంతో ఇండియన్ వుమెన్‌ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఈ హత్య కేసు నుంచి తన భార్యను ఎంతగానో ప్రేమించే భర్త ఎలా కాపాడాడు అనేదే ది వర్డిక్ట్ మూవీ స్టోరీ.

తమిళంలో విడుదలైన ది వర్డిక్ట్ సినిమా ఇప్పుడు Sun NXT లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. 8.5 IMDb రేటింగ్‌తో, ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.