|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హీరోలుగా మారిన క‌మెడియ‌న్లు – బ‌ద్మాషులు – రిలీజ్ డేట్ ఫిక్స్

Published: 10-05-2025, 2:51 PM
హీరోలుగా మారిన క‌మెడియ‌న్లు - బ‌ద్మాషులు - రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లోని ప్రముఖ కమెడియన్లు మహేష్ చింతల, విద్యాసాగర్ మరియు మురళీధర్ గౌడ్ హీరోలుగా నటించిన ‘బద్మాషులు’ సినిమా జూన్ 6న విడుదలవుతోంది. శంకర్ చేగూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.

కామెడీ హీరోల కథ

టాలీవుడ్ క‌మెడియ‌న్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి హీరోలుగా న‌టించిన మూవీ బ‌ద్మాషులు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో మ్యాడ్ ఫేమ్ మురళీధర్ గౌడ్ మ‌రో లీడ్ రోల్‌ లో క‌నిపిస్తోన్నాడు. ఈ మూవీకి శంకర్ చేగూరి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ కామెడీ సినిమా రిలీజ్ డేట్‌ను శ‌నివారం మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

బ‌ద్మాషులు మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్త‌య్యాయి.జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీపా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తోంది.

బద్మాషులు సినిమా విశేషాలు

రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ‌న్ మూవీ ఇద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. . క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉంటుంద‌ని అన్నారు. ఇటీవ‌ల ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. తెలంగాణ యాస‌లో సాగే డైలాగ్స్‌తో ఈ టీజ‌ర్ న‌వ్వించింది. బ‌లాదూర్‌గా తిరితే ఇద్ద‌రు యువ‌కులు చేసే అల్ల‌రి ప‌నుల‌తో ఈ మూవీ సాగ‌నుంది. డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంద‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. బ‌ద్మాషులు మూవీని బి. బాలకృష్ణ, సీ రామ శంకర్ నిర్మిస్తున్నారు.

“ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇది మన ఊరి కథ అని ఆడియెన్స్ ఫీల‌య్యేలా సినిమాలోని క్యారెక్ట‌ర్స్ చాలా నాచుర‌ల్‌గా ఉంటాయి. వంద శాతంఆడియెన్స్‌ను న‌వ్వించాల‌నే ఉద్దేశ్యంతో బద్మాషులు సినిమాను తెరకెక్కించాం” అని డైరెక్టర్ అన్నారు.

రిలీజ్ డేట్ మరియు వివరాలు

తెలుగులో ప‌లు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో మ‌హేష్ చింత‌ల క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు. కీడాకోలా, ఈ న‌గ‌రానికి ఏమైందితో పాటు మాయాబ‌జార్‌, కుబుల్ హై వెబ్‌సిరీస్‌లు అత‌డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. బ‌ల‌గం, డీజే టిల్లు, మ్యాడ్, మ్యాడ్ స్వ్కేర్ సినిమాల‌తో న‌టుడిగా బిజీ అయ్యారు ముర‌ళీధ‌ర్ గౌడ్‌. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీలో వెంక‌టేష్ మావ‌య్య పాత్ర‌లో న‌వ్వించాడు.

మొత్తంమీద, ‘బద్మాషులు’ సినిమా ఆడియన్స్ ని నవ్వించడానికి తెరకెక్కిన ఒక హాస్య ప్రధాన చిత్రం. జూన్ 6న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని ఆశిద్దాం.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.