|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: ‘కానిస్టేబుల్ కనకం’ చాప్టర్ 3.. థియేటర్లలో రిలీజ్! వర్ష బొల్లమ్మ మాస్ ట్రీట్!!

Published: 22-01-2026, 2:05 PM
Breaking: 'కానిస్టేబుల్ కనకం' చాప్టర్ 3.. థియేటర్లలో రిలీజ్! వర్ష బొల్లమ్మ మాస్ ట్రీట్!!
  • వర్ష బొల్లమ్మ ‘కానిస్టేబుల్ కనకం’ చాప్టర్ 3: థియేటర్లలో విడుదలకి సిద్ధం!
  • దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో మేఘ లేఖ, రాజీవ్ కనకాల కీలక పాత్రలు!
  • దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘కాల్ ఘాట్’ గ్లింప్స్ విడుదల – భారీ అంచనాలు!
  • ఈటీవీలో 30 ఏళ్ల ప్రయాణం.. శాంతి నివాసం సీరియల్ గుర్తు చేసుకున్న రాఘవేంద్రరావు!

వర్ష బొల్లమ్మ అభిమానులకు పండగే! బ్లాక్ బస్టర్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ చాప్టర్ 3 థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం చదవండి.

థియేటర్లలో ‘కానిస్టేబుల్ కనకం’ చాప్టర్ 3 సందడి!

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. కానిస్టేబుల్‌ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు.

బిగ్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నేను అశ్విని దత్ కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేష్ బాబుని పరిచయం చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. తర్వాత పెళ్లి సందడి గంగోత్రి.. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాం.ఆ విజయాల్లో భాగం సాయిబాబా కి ఈటీవీ కి ఉంది. తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేశారు. వర్ష చాలా మంచి ఆర్టిస్ట్. తను చాలా బిజీ కాబోతోంది. 30 ఏళ్ల క్రితం శాంతినివాసం సీరియల్ తో ఈటీవీతో మా జర్నీ మొదలైంది. శాంతి నివాసానికి రాజమౌళి డైరెక్టర్. నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా తీశాడు. ఈరోజు ఇండియాలోనే అగ్ర దర్శకుడుగా ఉన్నారు. శాంతి నివాసానికి హేమంత్ ఎడిటింగ్ చేశాడు. అప్పటినుంచి మా జర్నీ ఉంది. ఇప్పటి దర్శకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ నితిన్ లక్కీ హాండ్స్. వీళ్ళ కాంబినేషన్స్ అన్ని పిక్చర్స్ బాగుంటాయి. వీళ్ళ సక్సెస్ రేట్ చాలా బాగుంది. సురేష్ చక్కని మ్యూజిక్ అందించాడు. ఈవిన్ కథా సుధాలో ఇప్పటివరకు ఒక పది కథలు తీశాను. వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్ యూ

రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల!

నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఈ యూనిట్ మాకు చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండా ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్యు.

బ్లాక్ బస్టర్ సిరీస్‌గా ‘కానిస్టేబుల్ కనకం’!

వర్షా బొల్లమ్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసి మమ్మల్ని బ్లెస్స్ చేసినరాఘవేంద్రరావు గారికి, నిర్మాత అశ్విని దత్ గారికి థాంక్యూ సో మచ్. వాళ్లు ఇచ్చిన సపోర్టు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. చాప్టర్ 3 కాల్ ఘాట్ చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను. చాలామంది నేను పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేయాలని అంటుంటారు. కానీ అలాంటి అవకాశాలు సాధారణంగా రావు. నాకు అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత సాయిబాబా గారికి హేమంత్ గారికి ఈటీవీ విన్ వారికి మా డైరెక్టర్ ప్రశాంత్ కి చాలా చాలా థాంక్స్. ఈ సిరిస్ చాలా ఎంజాయ్ చేశాను. ఒక నటిగా చాలా సంతృప్తిరించిన సిరిస్ ఇది. రాజీవ్ గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందరికీ పేరుపేరునా థాంక్యూ. చాప్టర్ 3 నాకు ఒక సర్ప్రైజ్ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. అది ఇందులో హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. కానిస్టేబుల్ కనకం కు సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 థియేటర్లలో రిలీజ్ అవుతోంది. వర్ష బొల్లమ్మ నటన, రాఘవేంద్రరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.