|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కానిస్టేబుల్ కనకం 2: ఓటీటీ రికార్డులు బ్రేక్! థియేటర్లలో సీజన్ 3 – షాకింగ్ ట్విస్ట్ లు!

Published: 23-01-2026, 7:35 PM
కానిస్టేబుల్ కనకం 2: ఓటీటీ రికార్డులు బ్రేక్! థియేటర్లలో సీజన్ 3 - షాకింగ్ ట్విస్ట్ లు!
  • కానిస్టేబుల్ కనకం సీజన్ 2: ఉత్కంఠభరిత ట్విస్ట్ లతో ఓటీటీలో రికార్డు వ్యూస్!
  • వర్ష బొల్లమ్మ నటన అదుర్స్, రాజీవ్ కనకాల సపోర్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ కు ఊపిరి!
  • జనవరి 8, 2026న విడుదల, సురేష్ బొబ్బిలి సంగీతం మరో హైలైట్!
  • సీజన్ 3 థియేటర్లలో విడుదల, కానిస్టేబుల్ కనకం సంచలనాలకు సిద్ధం!

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఓటీటీలో విడుదలైంది. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదిరిపోయే ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సీజన్ 3 నేరుగా థియేటర్లలోకి రాబోతోంది.

కనకం ఇన్వెస్టిగేషన్ లో సంచలన నిజాలు!

ఓటీటీలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కానిస్టేబుల్ కనకం. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అదిరిపోయే ట్విస్ట్ లతో ఆడియన్స్ కు థ్రిల్ అందిస్తుంది. ఇప్పటికే రెండు సీజన్లో సూపర్ హిట్ గా నిలిచాయి. సీజన్ 3 నేరుగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో సీజన్ 2 రివ్యూపై ఓ లుక్కేయండి.

వెబ్ సిరీస్: కానిస్టేబుల్ కనకం సీజన్ 2

నటీనటులు: వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, మేఘ లేఖ, అవసరాల శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ తదతరులు

డైరెక్టర్: ప్రశాంత్ కుమార్ దిమ్మల

మ్యూజిక్: సురేష్ బొబ్బిలి

సీజన్ 2లో వర్ష బొల్లమ్మ విశ్వరూపం!

రిలీజ్ డేట్: జనవరి 8, 2026

ఓటీటీలో చాలా వెబ్ సిరీస్ లు వస్తుంటాయి. వాటికి కొత్త సీజన్లూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కానీ కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్, మిస్టరీ, ఎమోషన్.. ఈ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లో అదగొడుతోంది.

కానిస్టేబుల్ కనకం సీజన్ 1 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సీజన్ లోని ట్విస్ట్ లు భలే మజాను అందించాయి. ఇక సీజన్ 2 అంతకంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. ఈ సారి ట్విస్ట్ లు పెరిగాయి. ఉత్కంఠ పెరిగింది. కానిస్టేబుల్ కనకం సీజన్ 3ని డైరెక్ట్ గా థియటర్లలో రిలీజ్ చేస్తామన్న నేపథ్యంలో ఈటీవీ విన్ లో సీజన్ 2 ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.

అందరూ చంద్రిక చనిపోయిందని అనుకుంటారు. కానీ కనకం మాత్రం చంద్రిక బతికే ఉందని బలంగా నమ్ముతుంది. అందుకే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. చంద్రిక వాళ్ల ఇంటికి వెళ్తే అక్కడ ఓ చున్నీ దొరుకుతుంది. ఇక చంద్రిక మనీ ఆర్డర్ పంపే అడ్రెస్ కు వెళ్తే కనకం షాక్ అవుతుంది. మరి అక్కడ చంద్రిక ఉందా? అసలు సహస్ర ఎవరు? కనకం తల్లికి ఈ కథకు ఏంటీ సంబంధం? అన్నది సీజన్ 2లో చూడాల్సిందే.

థియేటర్లలోకి కానిస్టేబుల్ కనకం సీజన్ 3!

ఓటీటీలో థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. ఇక ట్విస్ట్ లతో కూడిన, సస్పెన్స్ తో ఊపేస్తూ, థ్రిల్ పంచే వెబ్ సిరీస్ లకు కచ్చితంగా ఆదరణ ఉంటుంది. కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ఈ ఫార్ములానే ఫాలో అయింది. అందుకే హిట్ కొట్టింది. సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్లే ఉన్నా అవి అందించే థ్రిల్ మాత్రం వేరే లెవల్. ఒకదానికి మించి ఒక ట్విస్ట్ ఉంటుంది.

చంద్రిక కోసం వెళ్లిన కనకానికి సహస్ర గురించి తెలియడం, సహస్రను ఎవరు చంపారో కనిపెట్టడం, చివరకు కనకం తల్లి ఎవరు అనే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అవుతుంది.

నటన పరంగా చూస్తే కానిస్టేబుల్ కనకం సీజన్ 2లో వర్ష బొల్లమ్మకు నూటికి నూరు మార్కులు పడతాయి. సీజన్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోసింది. ఈ సీజన్ లో మొత్తం ఆమెనే కనిపిస్తుంది. చంద్రిక కోసం ఆమె పడే తపన, చంద్రిక కనిపించాక ఎమోషన్, చంద్రికను చంపింది ఎవరో తెలుసుకున్నాక పలికించే బాధ, చివర్లో తన తల్లి ఎవరన్నది రివీల్ అయ్యాక కలిగే సంఘర్షణ.. ఇలా వర్ష బొల్లమ్మ నట విశ్వరూపమే చూపించింది. ఇక చంద్రికగా మేఘలేఖకు, రాజీవ్ కనకాల తదితరులకు ఈ సీజన్ లో ఎక్కువ స్కోప్ దక్కలేదు.

ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్లను చూడాలనుకునే ఆడియన్స్ కు కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మంచి ట్రీట్ లాంటి సిరీస్. ముఖ్యంగా కథను దర్శకుడు డిజైన్ చేసుకున్న విధానం, నడిపించిన తీరు కచ్చితంగా నచ్చుతుంది.

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఓటీటీలో ఒక సంచలనం. సీజన్ 3 థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మరింత ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.