
ఒకే కథతో రెండు వెబ్ సిరీస్‌లు తెరకెక్కిన సంఘటన తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ డైరెక్టర్ చేసిన ఆరోపణలు మరియు వారి స్పందన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Key Points
‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ కథను కాపీ చేసినట్లు ఆరోపణలు.
‘విరాటపాలెం’ వెబ్ సిరీస్ ట్రైలర్ తో పోలికలు ఉన్నట్లు ఆరోపణ.
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ చేసినట్లు డైరెక్టర్ ఆరోపణ.
ఈటీవీ విన్ కోర్టును ఆశ్రయించింది.
కథనం కాపీరైట్ వివాదం
సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాత పైరసీకి గురవుతాయి. అలాగే ఇటీవల ఒకే పేరుతో ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్ట్స్‌కు ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలనే కాపీ కొడతారనుకొంటే ఇప్పుడు వెబ్ సిరీస్‌లను కూడా కాపీ కొడుతున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దానికి కారణం ఏంటంటే.. ఒకేసారి తెలుగులో ఒకే కథతో రెండు వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. ఒకటి ఈటీవీ విన్ లో ‘కానిస్టేబుల్ కనకం’ పేరుతో రాబోతుంది. అలాగే మరొకటి జీ నెట్ వర్క్ లో… ‘విరాటపాలెం’ టైటిల్‌తో తెరకెక్కించారు. దీనిని ఈనెలలోనే విడుదల చేయనున్నారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈటీవీ విన్ కోర్టుకు వెళ్ళిన విషయం
అయితే ‘కానిస్టేబుల్ కనకం’(Constable Kanakam) మాత్రం చిత్రీకరణ దశలో ఉంది. విరాటపాలెం(Viratapalem) ట్రైలర్ చూసిన తర్వాత కథనే కొన్ని మార్పులు చేసి జీ5 సిరీస్ సిద్ధం చేసినట్లు ఈటీవీ విన్ గమనించి కోర్టును ఆశ్రయించింది. తాజాగా, ఈ విషయంపై ‘కానిస్టేబుల్ కనకం’ డైరెక్టర్ స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మా సిరీస్ ఈటీవీ ఒరిజినల్. దేని నుంచి మేము కాపీ కొట్టలేదు. కానీ మా కథ నుంచి కాపీస్ వస్తాయి కావచ్చు. అలా కూడా జరుగుతుంది కానీ వాళ్ల పేర్లు చెప్పాలనుకోవడం లేదు. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేస్తారు. రాకముందే కాపీ కొట్టేవాళ్లను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు.
డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
వాళ్లకు పెద్దవాళ్ళు పేరు పెడితే అలాగే పిలుస్తాను. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ కొట్టి సేమ్ క్యారెక్టర్స్ కూడా అలాగే చేశారు. మా స్క్రిప్ట్ మాత్రం 2022లో రిజిష్టర్ చేయించుకున్నాము. కానిస్టేబుల్ కనకం పార్ట్-1, 2 కూడా ఈటీవీ విన్ చేస్తోంది. మేము చేసే వాటిల్లో ఎక్కువ కాస్ట్లీ ప్రాజెక్ట్ ఇదే. విజువల్ అంతా అయిపోయాక మీకు చూపించాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని కాపీ కొట్టారని అంటారని మాకు బాధతో, భయంతో చూపిస్తున్నాం. చివరగా ఆడియన్స్ అన్నింటిని జడ్జ్ చేస్తారు. వాళ్లు అన్నింటినీ గమనిస్తారు చెప్తారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరకు ప్రేక్షకులే నిర్ణయించాలి. ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ నిజంగానే కాపీ కొట్టబడిందా లేదా అనేది వారి తీర్పునే ఆధారం చేసుకుంటుంది.


