
రవితేజ, శ్రీలీల నటించిన ‘మాస్ జాతర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే, తాజాగా ఈ సినిమా నుండి తీవ్ర వివాదాస్పదంగా మారిన ‘ఓలే ఓలే’ పాట పూర్తి వీడియోను విడుదల చేశారు. పాట లిరిక్స్‌పై బూతులే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Key Points
రవితేజ, శ్రీలీల 'మాస్ జాతర' చిత్రం ఆశించినంతగా మెప్పించలేదు.
'మాస్ జాతర'లోని 'ఓలే ఓలే' పాట తీవ్ర వివాదానికి దారితీసింది.
పాట లిరిక్స్ బూతులతో కూడి ఉన్నాయని తొలగించాలని డిమాండ్.
రచయిత, రవితేజ, శ్రీలీల పట్ల కూడా వ్యతిరేఖత వ్యక్తమైంది.
‘మాస్ జాతర’ చిత్రం – అంచనాలు, ఫలితం
రవితేజ (Ravi teja), శ్రీలీల జోడీగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాస్ జాతర’.. అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. అయితే, తాజాగా ఆ మూవీ నుంచి వివాదస్పందంగా మారిన ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
‘మాస్ జాతర’ నుంచి ఓలే ఓలే సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. వాస్తవంగా ఈ సాంగ్ లిరిక్స్ పట్ల చాలామంది విమర్శించారు. లిరిక్స్ లో ఎక్కువగా బూతులే ఉన్నాయంటూ వెంటనే ఆ సాంగ్‌ను తొలగించాలని కూడా సోషల్‌మీడియాలో చాలామంది డిమాండ్ చేశారు. ఇందులోని లిరిక్స్‌కు ఎలాంటి అర్ధం- పర్థం లేదంటూ కామెంట్లు చేశారు. తలా తోక లేదు ఆపై రాగం, తాళం లేదంటూ పేర్కొన్నారు. ఈ పాట రచయితతో పాటు, రవితేజ, శ్రీలీల పట్ల కూడా వ్యతిరేఖత వచ్చింది. అయితే, ఇప్పుడు ఏకంగా వీడియో వర్షన్‌ను విడుదల చేశారు.
‘ఓలే ఓలే’ పాటపై వివాదం, డిమాండ్లు
పూర్తి వీడియో విడుదల – తదుపరి ఏమిటి?
‘మాస్ జాతర’ నుండి వివాదాస్పదమైన ‘ఓలే ఓలే’ పాట పూర్తి వీడియో విడుదలవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్న ఈ పాట.. వీడియో రూపంలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.


