|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Coolie: రజినీకాంత్ ‘కూలీ’ విడుదల తేదీ ప్రకటన

Published: 06-05-2025, 10:37 AM
Coolie: రజినీకాంత్ 'కూలీ' విడుదల తేదీ ప్రకటన

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Key Points

1

రజినీకాంత్ నటించిన 'కూలీ' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

2

ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల.

4

'వార్ 2' తో పోటీలో 'కూలీ' విడుదల.

‘కూలీ’ విడుదల తేదీ ఖరారు

సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ డిక్లేర్ అయింది. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్(Lokesh KanagaRaj) డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ “కూలీ”(Coolie). ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Picturs) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రజినీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. చిత్రంలో అక్కినేని నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.

గత మార్చి14న లోకేష్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా కూలీ టీజర్ విడుదల కాగా.. ఈ టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే, ఈ చిత్రం విడుదల రోజే ఎన్టీఆర్(Jr NTR), హృతిక్ రోషన్(Hrutik Roshan) నటించిన ‘వార్ 2′(War-2)తో కూడా రిలీజ్ కానుండటం వలన బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలకు గట్టి పోటీ ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రకటన వెలువడిన తరువాత తలైవా ఫ్యాన్స్ మాత్రం “కూలీ” ఫీవర్ లో పడిపోయి, సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది.

నటీనటుల వివరాలు

బాక్సాఫీస్ పోటీ

చివరగా, రజినీకాంత్ అభిమానులకు ‘కూలీ’ సినిమా విడుదల తేదీ ప్రకటన ఒక పెద్ద శుభవార్త. అయితే, ‘వార్ 2’ తో గట్టి పోటీ ఉండనున్నది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.