
కోర్టు డ్రామాలు ప్రేక్షకులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ‘గుడ్ వైఫ్’ అనే కోర్టు డ్రామా థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. భర్త ఆన్‌లైన్ సెక్స్ వీడియోలో ఉండటంతో, అతనిని కాపాడేందుకు భార్య చేసే పోరాటమే ఈ సిరీస్ కథ.
Key Points
ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన కోర్టు డ్రామా థ్రిల్లర్ ‘గుడ్ వైఫ్’
భర్త ఆన్‌లైన్ సెక్స్ వీడియోలో ఉన్నాడు, అతనిని కాపాడేందుకు భార్య పోరాటం
జియోహాట్‌స్టార్‌లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది
‘గుడ్ వైఫ్’ ఓటీటీలో రిలీజ్
కోర్టు డ్రామా థ్రిల్లర్లకు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ మంచి రెస్పాన్సే దక్కుతుంది. రీసెంట్ గా కోర్ట్ మూవీ ఎంతటి సూపర్ హిట్ గా నిలిచిందో తెలిసిందే. అలాగే ఓటీటీలో క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అదరగొడుతోంది. ఇప్పుడు అదే బాటలో ఓటీటీ ఆడియన్స్ కు థ్రిల్ పంచేేందుకు మరో కోర్టు డ్రామా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (జులై 4) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఆ వెబ్ సిరీస్ ‘గుడ్ వైఫ్’.
భర్తను కాపాడుకోవడం కోసం మళ్లీ నల్లకోటు వేసుకుని కోర్టులో వాదించే భార్య కథే ఈ ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్. మంచి డ్రామాతో పాటు థ్రిల్ ను పంచే ఈ సిరీస్ శుక్రవారం డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్ స్పెషల్ గా రూపొందిన ఈ సినిమా అదే ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్లూ ఒకేసారి రిలీజ్ అయ్యాయి.
భార్య కోర్టు పోరాటం
ప్రధానంగా తమిళ్ కోర్టు డ్రామాగా తెరకెక్కించిన గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ ను మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాళి, మరాఠి భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులో ఉంది. గుడ్ వైఫ్ అనేది అదే పేరుతో హిట్ అయిన అమెరికన్ సిరీస్ అధికారిక తమిళ రీమేక్. కానీ ఇది కార్బన్ కాపీ కాదు. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు కథ మార్చారు.
తన భర్త ఉన్న ఓ సెక్స్ టేప్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ గా మారుతుంది. అతణ్ని అరెస్టు చేస్తారు. మరోవైపు పిల్లలు, సమాజం.. ఇలా ప్రతి చోట ఆ భార్యకు సమస్యలు ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో తన భర్తను కాపాడుకోవడం కోసం ఆ భార్య కోర్టులో న్యాయవాదిగా పోరాడుతుంది. ఆ న్యాయవాదిగా ప్రియమణి నటించింది. భర్తగా సంపత్ రాజ్ యాక్ట్ చేశాడు. మరి కుట్రలను దాటి ఆమె తన భర్తను నిర్దోషిగా నిరూపించిందా అన్నదే కథ. ఈ సిరీస్ కు రేవతి డైెరెక్టర్. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ స్పెషల్ ఫిల్మ్స్ చేస్తూ ప్రియమణి సాగిపోతోంది.
ప్రియమణి నటన
భామాకలాపం అనే స్ఫై థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ప్రియమణి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ రెండు సీజన్లు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లోనూ ప్రియమణి మెరిసింది. మంచి థ్రిల్ కావాలనుకునే వాళ్లు, కోర్టు డ్రామాను ఇష్టపడేవాళ్లు ఈ గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ పై ఓ సారి చూసేయొచ్చు.
తన భర్తను కాపాడుకోవడానికి భార్య చేసే పోరాటం, కోర్టులోని ఉద్రేకాలు, న్యాయ వ్యవస్థలోని అంశాలను చూపిస్తూ ‘గుడ్ వైఫ్’ ఆకట్టుకుంటుంది. ఈ థ్రిల్లింగ్ సిరీస్ ఖచ్చితంగా చూడదగినది.


