|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాప్‌ నిర్మాతతో ఛాన్స్‌ కొట్టేసిన ‘కోర్ట్‌’ హీరోయిన్‌ శ్రీదేవి

Published: 07-07-2025, 3:55 AM
టాప్‌ నిర్మాతతో ఛాన్స్‌ కొట్టేసిన 'కోర్ట్‌' హీరోయిన్‌ శ్రీదేవి

‘కోర్ట్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీదేవికి తాజాగా కోలీవుడ్‌లో అవకాశం లభించింది. ప్రముఖ నిర్మాత కేజీఆర్‌ నిర్మించే సినిమాలో ఆమె నటించనుంది. ఇది ఆమె రెండో సినిమా.

Key Points

1

'కోర్ట్‌' సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన శ్రీదేవి

2

కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతతో సినిమా ఛాన్స్‌

4

తెలుగు సినిమా నుండి కోలీవుడ్‌కు విజయవంతమైన అడుగు

‘కోర్ట్‌’ సినిమా విజయం

‘కోర్ట్‌’ సినిమాతో తెలుగమ్మాయి శ్రీదేవి మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్‌గా తనకు ఇదే మొదటి సినిమా.. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది.  కాకినాడ యువతి శ్రీదేవికి తాజాగా కోలీవుడ్‌ సినిమా ఛాన్స్‌ వచ్చింది. తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను  సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. తొలి సినిమాతోనే మెప్పించిన మన తెలుగమ్మాయి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో అవకాశం రావడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.

కోలీవుడ్‌ ప్రముఖ నిర్మాత‌గ ‘కేజీఆర్’ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాను ప్రకటించాడు. ఆయనకు జోడీగానే శ్రీదేవి నటిస్తుంది. కేజీఆర్‌కు నిర్మాతగా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. గతంలో  శివ‌కార్తికేయ‌న్‌తో హీరో, డాక్ట‌ర్‌, అయ‌లాన్ సినిమాలు చేశారు. విజ‌య్ సేతుప‌తి కాపే ర‌ణ‌సింగంతో పాటు ప్ర‌భుదేవాతో గులేభ‌కావ‌లి వంటి సినిమాలను ఆయన నిర్మించారు. పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌ చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూట‌ర్‌గా విడుదల చేశారు.

కోలీవుడ్‌ ప్రవేశం

కేజీఆర్‌తో సినిమా

తెలుగు సినీ పరిశ్రమ నుండి కోలీవుడ్‌కు వెళ్లిన శ్రీదేవికి అభినందనలు. ‘కోర్ట్‌’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆమె తన నటనతో కోలీవుడ్‌లోనూ మెప్పించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.