
కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ జగదీశ్ వివాహం చేసుకున్నాడు. వైజాగ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తున్నాయి.
Key Points
కోర్ట్ సినిమా డైరెక్టర్ రామ్ జగదీశ్ వివాహం
వైజాగ్‌లో ఘనంగా జరిగిన పెళ్లి వేడుకలు
కోర్ట్ టీం సభ్యులు పెళ్లికి హాజరు
కోర్ట్ సినిమా విజయం
కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ మూవీ ఈ ఏడాది ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు కదా. మొదట బాక్సాఫీస్ దగ్గర, ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్లింది. అలాంటి సినిమాను అందించిన రామ్ జగదీశ్ పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం (ఆగస్టు 17) రాత్రి అతని పెళ్లి వైజాగ్ లో జరిగింది.
హీరో నాని నిర్మాతగా ఉన్న కోర్ట్ మూవీ ఈ ఏడాది పెద్ద హిట్. ప్రియదర్శి, శివాజీ, రోషన్, శ్రీదేవిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాను రామ్ జగదీశ్ తెరకెక్కించాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటివాడయ్యాడు. వైజాగ్ లో కార్తీక అనే అమ్మాయిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ జగదీశ్ వివాహం
రామ్ జగదీశ్ పెళ్లికి కోర్ట్ మూవీ టీమ్ కూడా వచ్చింది. వీళ్లలో నటుడు శివాజీ రిసెప్షన్ ఫొటోలను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. తన తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ పెళ్లి వార్తలు అభిమానులను ఆకర్షించాయి.
పోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ కోర్ట్ సినిమాలో చూపించారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో టచ్ చేశాడు డైరెక్టర్ రామ్ జగదీశ్. కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చట్టంలోని లొసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నది అర్థవంతంగా సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.
వైరల్ ఫొటోలు
చందు, వెన్నెల పాత్రలు పోషించిన రోషన్, శ్రీదేవి మంచి పేరు తెచ్చుకోగా.. మంగపతి పాత్రలో శివాజీ జీవించేశాడు. ఇక లాయర్ గా ప్రియదర్శి తనదైన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
అటు రామ్ జగదీశ్ విషయానికి వస్తే అతడు తన రెండో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈసారి కూడా నాని ప్రొడక్షన్ లోనే మూవీ తీయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో అతడు సినిమా ప్లాన్ చేయబోతున్నాడన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
తన తొలి చిత్రంతోనే విజయం సాధించిన రామ్ జగదీశ్ వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. అతని భవిష్యత్ సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


