|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు సినిమాకు రివ్యూలు బంద్! కోర్టు సంచలన తీర్పు! మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!!

Published: 10-01-2026, 7:15 AM
చిరు సినిమాకు రివ్యూలు బంద్! కోర్టు సంచలన తీర్పు! మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!!
  • చిరు ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు కోర్టు షాక్: రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదని సంచలన తీర్పు!
  • సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు, నయనతార హీరోయిన్, వెంకటేష్ కీలక పాత్ర!
  • ప్రభాస్ ‘రాజాసాబ్’ మినహా మిగతా సినిమాలన్నీ కోర్టు పర్మిషన్ తీసుకున్నాయి, భర్త మనశయులకు విఙ్ఞప్తి కూడా!
  • బుక్ మై షోలో రివ్యూ, రేటింగ్ ఆప్షన్ డిజేబుల్, యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూల వల్లే ఈ నిర్ణయం!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా గురించి ఒక సంచలన వార్త! ఈ సినిమాకు రివ్యూలు, రేటింగ్స్ ఇవ్వకూడదని కోర్టు తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!

చిరు సినిమాకు కోర్టు తీర్పు వెనుక అసలు కారణం ఇదే!

MSVG: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మూవీ మన శంకరవరప్రసాద్ గారు. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా మన శంకరవరప్రసాద్ గురించి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సినిమా చూసిన తరువాత బుక్ మై షోలో రివ్యూలు గానీ, రేటింగ్ లు గానీ ఇవ్వకూడదు అంటూ సంచలన తీర్పు ఇచ్చింది. దానికి కారణం, ఈ మధ్య కాలంలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో చాలా మంది కావాలని సినిమాలకు నెగిటివ్ రివ్యూ, రేటింగ్ లు ఇస్తున్నారు.

రివ్యూలు, రేటింగ్స్ పై నిషేధం! ఇక నెగెటివ్ టాక్ ఉండదు!

దానివల్ల మంచి సినిమాలపై ప్రభావం పడుతోంది. ఆలాంటి సిచువేషన్ మన శంకరవరప్రసాద్(MSVG) గారు సినిమాకు రాకూడదు అని మాకెర్స్ కోర్టును ఆశ్రయించారు. దీంతో, కోర్టు పైవిధంగా తీర్పును వెల్లడించింది. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న ప్రభాస్ రాజాసాబ్ మినహాయించి మిగతా అన్ని సినిమాలు ఈ విషయంలో కోర్టు నుంచి పెర్మిషన్స్ తీసుకున్నాయి.

సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలకు ఊరట!

రవి తేజ హీరోగా వస్తున్న భర్త మనశయులకు విఙ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి, నీవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలకు కూడా కోర్టు ఇదే తీరును ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ బుక్ మై షో కూడా మార్పులు చేసింది. ఈ మూడు సినిమాలకు రివ్యూ అండ్ రేటింగ్ ఆప్షన్ ను డిజేబుల్ చేసింది.

చిరంజీవి సినిమా విషయంలో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.