|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చేపలకు అమ్మాయిలను ఆహారంగా వేసే క్రిమినల్- ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సర్వైవల్ హారర్ థ్రిల్లర్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published: 28-09-2025, 5:47 AM
చేపలకు అమ్మాయిలను ఆహారంగా వేసే క్రిమినల్- ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సర్వైవల్ హారర్ థ్రిల్లర్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలో కొత్తగా విడుదలైన ‘డేంజరస్ యానిమల్స్’ ఒక ఉత్కంఠభరిత సర్వైవల్ హారర్ థ్రిల్లర్. చేపలకు అమ్మాయిలను ఆహారంగా వేసే సైకో క్రిమినల్ నుంచి ఓ యువతి ఎలా తప్పించుకుందనేది ఈ సినిమా కథాంశం. ఈ తెలుగు చిత్రం ప్రస్తుతం లయన్స్ గేట్ ప్లే మరియు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Key Points

1

డేంజరస్ యానిమల్స్ (Dangerous Animals) ఒక ఉత్కంఠభరిత సర్వైవల్ హారర్ థ్రిల్లర్.

2

సముద్రంలో సైకో క్రిమినల్ అమ్మాయిలను షార్క్‌లకు ఆహారంగా వేయడం ప్రధాన కథాంశం.

4

ఈ చిత్రం లయన్స్ గేట్ ప్లే మరియు అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

డేంజరస్ యానిమల్స్: కథాంశం, రేటింగ్స్

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతూనే ఉంటాయి. జోనర్స్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ అందులో డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఓటీటీ ఆడియెన్స్‌కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటారు. అలా ఇప్పటికీ ఎన్నో ఓటీటీ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి.

వాటిలో రీసెంట్‌గా ఓటీటీ రిలీజ్ అయిన సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సినిమానే డేంజరస్ యానిమల్స్. 2025లో మే 17న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటగా ప్రీమియర్ అయిన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. అనంతరం జూన్ న కెనడాలో థియేట్రికల్ రిలీజ్ అయింది డేంజరస్ యానిమల్స్.

అలాగే, జూన్ 12 ఆస్ట్రేలియాలో కిస్మెట్ మూవీస్ ద్వారా విడుదలైంది. హారర్ సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన డేంజరస్ యానిమల్స్ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.4 రేటింగ్ సాధించుకుంది. అలాగే, రొట్టెన్ టొమాటోస్ ఈ మూవీకి 87 శాతం ఫ్రెష్ కంటెంట్ అని సర్టిఫికెట్ ఇచ్చింది.

సినిమా విడుదలైంది ఎక్కడంటే?

సముద్రపు అందాలు చూసేందుకు వెళ్లే అందమైన అమ్మాయిలను చేపలకు ఆహారంగా వేసే సైకో క్రిమినల్ చుట్టూ డేంజరస్ యానిమల్స్ సినిమా సాగుతుంది. సముద్రంలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే సైకో అక్కడున్న షార్క్ చేపల జోన్‌లో అమ్మాయిలను పడేయడం, కిందకు వేలాడదీసి ఎరగా ఉంచడం వంటివి చేస్తాడు.

అయితే, షార్క్‌లను దైవంగా భావించే ఆ సైకో నుంచి ఓ యువతి ఎలా తప్పించుకుంది అనేది ఉత్కంఠంగా, థ్రిల్లింగ్‌గా మంచి ట్విస్టులతో డేంజరస్ యానిమల్స్ మూవీ ఎంగేజ్ చేస్తుంది. ఇలాంటి ఈ డేంజరస్ యానిమల్స్ ఓటీటీలోకి వచ్చేసింది. సెప్టెంబర్ 26 నుంచి లయన్స్ గేట్ ప్లేలో డేంజరస్ యానిమల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

ఇంగ్లీష్‌తోపాటు హిందీ, తమిళం, తెలుగు వంటి నాలుగు భాషల్లో లయన్స్ గేట్ ప్లే‌లో డేంజరస్ యానిమల్స్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, లయన్స్ గేట్‌ప్లే కంటే ముందుగా మరో ఓటీటీలో కూడా డేంజరస్ యానిమల్స్ అందుబాటులో ఉంది. అదే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ.

అమెజాన్ ప్రైమ్‌లో కూడా డేంజరస్ యానిమల్స్ ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. రెండు ఓటీటీల్లో ఈ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ డేంజరస్ యానిమల్స్ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.

ఈ ఉత్కంఠభరిత సర్వైవల్ హారర్ థ్రిల్లర్‌ను తెలుగులో చూడాలనుకునే వారు లయన్స్ గేట్ ప్లే లేదా అమెజాన్ ప్రైమ్‌లో ఎంచక్కా చూసేయొచ్చు. మంచి రేటింగ్స్ తో వచ్చిన ఈ సినిమా థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.