
కన్నడ బ్యూటీ రచిత రామ్ నటిస్తున్న ‘కల్ట్’ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఓ బోల్డ్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాత్రూమ్‌లో సిగరెట్ తాగుతూ దర్శనమిచ్చిన రచిత లుక్ అభిమానులను షాక్‌కి గురిచేసింది.
Key Points
రచిత రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కల్ట్' సినిమా జనవరి 23న విడుదల.
రచిత పుట్టినరోజు సందర్భంగా విడుదలైన బోల్డ్ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది.
పోస్టర్‌లో రచిత బాత్రూమ్‌లో సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కనిపించింది.
ప్రేమ వైఫల్యం తర్వాత ఓ అమ్మాయి జీవితంలోని మలుపుల నేపథ్యంతో ఈ చిత్రం.
‘కల్ట్’ మూవీ: రచిత రామ్, జైద్ ఖాన్ రొమాంటిక్ థ్రిల్లర్
కన్నడ బ్యూటీ రచిత రామ్ (Rachita Ram)ఇటీవల ‘కూలీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రచిత రామ్ వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా నటిగా ఫుల్ జోష్‌లో ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘కల్ట్’(Cult) ఒకటి. ఇది ‘బ్లడీ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో జైద్ ఖాన్(Zaid Khan) సరసన రచిత రొమాన్స్ చేయనుంది. అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మలైకా వాసుపాల్(Malaika Vasupal) ,రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
పుట్టినరోజు ప్రత్యేక పోస్టర్: బోల్డ్ లుక్‌లో రచిత
ఇక ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్, లోకీ సినిమాస్ బ్యానర్స్‌పై అనిల్ కుమార్, సంతోష్ శేఖర్, నరసింహా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్స్‌లోకి రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కల్ట్’ నుంచి చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, హీరోయిన్ రచిత రామ్ పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ఆమె లేడీ డాన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విడుదలైన పోస్టర్‌లో… రచిత ఓ పల్చటి డ్రెస్ ధరించి బ్లాక్ షార్ట్‌లో బాత్రూమ్‌లో టాయిలెట్ సీటింగ్‌పై కూర్చొని సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో కనిపించింది.
‘కల్ట్’ కథా నేపథ్యం: ప్రేమ వైఫల్యం తర్వాత…
ఇక ఆమె పక్కన మంటలు చెలరేగి గిటార్ కాలిపోతుండగా.. వెనకాలే ఓ వ్యక్తి బాధతో చూస్తున్న ఫొటో కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఇందులో ‘‘నీ జ్ఞాపకాలను ఫ్లష్ చేసి తుడిచి పెట్టలేను’’ అనే కొటేషన్ రాసి ఉండటం ఆసక్తికరంగా మారింది. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయి ఆ తర్వాత ఎలా మారిపోయింది.. ఆమె జీవితం ఏ మలుపులు తిరుగుతుంది.. అనే పాత్రలో రచిత కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘కల్ట్’ మూవీ నుంచి విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. రచిత రామ్ నటన, కథా నేపథ్యం ఆసక్తికరంగా మారాయి. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది.


