|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

D55 మాస్ అప్డేట్: ధనుష్, శ్రీలీల స్టెప్పులు చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ అవుతున్న డ్యాన్స్!

Published: 23-06-2026, 1:16 AM
D55 మాస్ అప్డేట్: ధనుష్, శ్రీలీల స్టెప్పులు చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ అవుతున్న డ్యాన్స్!
  • D55 ‘ఓం’ షూటింగ్ చెన్నైలో వేగంగా సాగుతోంది.
  • ధనుష్, శ్రీలీల కలిసి అదిరిపోయే డ్యాన్స్ నంబర్ చేస్తున్నారు.
  • ‘మారీ’ సాయి పల్లవి డ్యాన్స్‌ను మించేలా ఉంటుందని హైప్.
  • రెడ్ హిల్స్‌లో భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

కోలీవుడ్ మాస్ హీరో ధనుష్ నటిస్తున్న D55 ‘ఓం’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ధనుష్, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న ఈ డ్యాన్స్ నంబర్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం!

D55 ‘ఓం’: టైటిల్ నుంచే అంచనాలు!

కోలీవుడ్ స్టార్ ధనుష్, దర్శకుడు రాజ్ కుమార్ కలయికలో వస్తోన్న చిత్రం ‘ఓం’. ధనుష్ కెరీర్‌లో 55వ సినిమాగా రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ నుంచే క్రేజీ హైప్ క్రియేట్ అయింది. వండర్‌బార్ ఫిలింస్ అండ్ RTake స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా, మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే పూజాకార్యక్రామలతో ఘనంగా స్టార్ట్ అయినా ఈ చిత్రానికి సంబంధించి తాజాగా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం OM చిత్రీకరణ కోసం చెన్నైలోని రెడ్ హిల్స్‌లో ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారట. ధనుష్ అండ్ శ్రీలీల ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలుస్తుండగా.. ఇది వారిద్దరితో కూడిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్ అని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. ‘మారీ’లో ధనుష్, సాయి పల్లవి డ్యాన్స్‌తో దుమ్మురేపగా.. ఇప్పుడు ధనుష్, శ్రీలీలతో సాంగ్‌ అంటే ఇది ఏ రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ధనుష్, శ్రీలీల మాస్ డ్యాన్స్ నంబర్!

చెన్నైలో భారీ సెట్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!

ధనుష్, శ్రీలీలల అదిరిపోయే స్టెప్పులతో ‘ఓం’ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం. ఈ మాస్ డ్యాన్స్ నంబర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.