|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డాడా హీరో కొత్త మూవీ.. ఆ సంస్థ చేతికి ఓటీటీ రైట్స్‌

Published: 26-10-2025, 12:20 AM
డాడా హీరో కొత్త మూవీ.. ఆ సంస్థ చేతికి ఓటీటీ రైట్స్‌

డాడా విజయంతో గుర్తింపు పొందిన హీరో కెవిన్ తాజా చిత్రం ‘మాస్క్’ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆండ్రియా, రుహాని శర్మ హీరోయిన్లుగా నటించారు. కాగా, ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 దక్కించుకుంది.

Key Points

1

హీరో కెవిన్ నటించిన తాజా చిత్రం 'మాస్క్' నవంబర్ 21న విడుదల కానుంది.

2

ఆండ్రియా, రుహాని శర్మ హీరోయిన్లుగా నటించగా, విక్రమన్‌ అశోక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

4

ఈ చిత్రం చెన్నై నేపథ్యంలో సాగే డార్క్‌ కామెడీ కథాచిత్రంగా ఉండనుంది.

హీరో కెవిన్ నూతన చిత్రం ‘మాస్క్’ వివరాలు

డాడా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కెవిన్‌ ( Kavin ). అయితే ఆ తర్వాత నటించిన బ్లడీ బెగ్గర్, ఇటీవల విడుదలైన కిస్‌ చిత్రాలు ఈయన్ని పూర్తిగా నిరాశపరిచాయి. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాస్క్‌. ఆండ్రియా హీరోయిన్‌గా నటించారు. అంతేకాకుండా ఈమె చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం విశేషం. ఇందులో మరో హీరోయిన్‌గా రుహాని శర్మ కూడా నటించారు. చార్లీ, రమేష్‌ తిలక్, కల్లూరి విను, అర్చన చాందోక్‌ తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు.

‘మాస్క్’ చిత్రంలో నటించిన తారాగణం

దర్శకుడు వెట్రిమారన్‌ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ ద్వారా విక్రమన్‌ అశోక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జి. ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని, ఆర్‌డీ రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్‌ 21వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్ర పోస్టర్‌ ఇటీవల దీపావళి సందర్భంగా విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ, ఆడియో హక్కులను టి సిరీస్‌ సంస్థ పొందినట్లు చెప్పారు. ఇది పూర్తిగా చెన్నై నేపథ్యంలో సాగే డార్క్‌ కామెడీ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.

‘మాస్క్’ ఓటీటీ, ఆడియో హక్కులు ఎవరికి?

మాస్క్ చిత్రం ఇప్పటికే దీపావళి పోస్టర్‌తో మంచి స్పందన పొందింది. కెవిన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ డార్క్‌ కామెడీ సినిమా ప్రేక్షకులని అలరించడం ఖాయం. జి5 ద్వారా త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.